మహేష్ బాబు సరసన హాట్ బ్యూటీ కత్రిన కైఫ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమాగా రూపొందుతున్న “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు మహేష్. “రంగస్థలం” తరువాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కత్రినా కైఫ్ ని నటింపజేయాలని చూస్తున్నారట దర్శకుడు […]

Advertisement
Update:2019-01-04 10:34 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమాగా రూపొందుతున్న “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు మహేష్. “రంగస్థలం” తరువాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కత్రినా కైఫ్ ని నటింపజేయాలని చూస్తున్నారట దర్శకుడు సుకుమార్.దాంతో మరింత క్రేజ్ తీసుకురావడానికి మహేష్ సరసన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట సుకుమార్.
అలా అనుకున్నాడో లేదో ఇలా ముంబై వెళ్లి కత్రినా ని కలిశాడట కూడా. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించనున్నారు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు. కత్రినా కైఫ్ ఇంతకుముందు బాలయ్య సరసన “అల్లరి పిడుగు” చిత్రంలో అలాగే వెంకటేష్ సరసన “మల్లీశ్వరి” చిత్రంలో నటించింది. ఆ రెండింట్లో “మల్లీశ్వరి” హిట్ కాగ “అల్లరి పిడుగు” మాత్రం ఫ్లాప్ అయ్యింది.
Tags:    
Advertisement

Similar News