ఆశావాహులకు ఝలక్.... ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే!
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కానుంది. దీంతో మంత్రి వర్గంలో బెర్తు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో మంగళవారం నుంచి పంచాయతీరాజ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీరాజ్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున… మంత్రి వర్గ విస్తరణ చేసేందుకు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది. కోడ్ అమలులో ఉన్నందున అసెంబ్లీ […]
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం కానుంది. దీంతో మంత్రి వర్గంలో బెర్తు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో మంగళవారం నుంచి పంచాయతీరాజ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీరాజ్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున… మంత్రి వర్గ విస్తరణ చేసేందుకు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది. కోడ్ అమలులో ఉన్నందున అసెంబ్లీ సమావేశానికి కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్ తప్పనిసరి అని పేర్కొంది.
దీంతోపాటు ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లతోపాటు అధికారుల బదిలీలు చేపట్టవద్దని కమిషన్ ఆదేశించింది. బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీ నిలిపి వేయాలని సూచించింది. పాలక మండళ్లు ఉన్న చోట జిల్లా, మండల , మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని…. కానీ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.
జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని…. ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి శంకుస్థాపనలు కానీ తదితర పనులు చేపట్టేందుకు వీల్లేదు. అయితే మంత్రి వర్గ విస్తరణకు కూడా ఛాన్స్ లేకపోవడంతో…. ఫిబ్రవరిలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం.
జనవరి 31వరకు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు మంత్రి వర్గ విస్తరణకు అవకాశం లేదు. ఆ తర్వాతే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారు…మరికొంత కాలం వేచి చూడక తప్పదు.