అట్టుడుకుతున్న కేరళ.... నేడు బంద్

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దేవాలయంలోనికి నిన్న ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆచారాలను మంటగలిపి 50 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలు ప్రవేశించడంతో…. ఆగ్రహం చెందిన శబరిమల రక్షణ సమితి ఇవాళ కేరళ బంద్‌కు పిలుపునిచ్చింది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. బంద్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని టూరిజం హోటల్స్ వద్ద కూడా ప్రభుత్వం […]

Advertisement
Update:2019-01-03 04:25 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దేవాలయంలోనికి నిన్న ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ ఆచారాలను మంటగలిపి 50 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలు ప్రవేశించడంతో…. ఆగ్రహం చెందిన శబరిమల రక్షణ సమితి ఇవాళ కేరళ బంద్‌కు పిలుపునిచ్చింది.

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. బంద్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని టూరిజం హోటల్స్ వద్ద కూడా ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బంద్ సంపూర్ణంగా కొనసాగుతుండటంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు తమిళనాడు, కేరళ సరిహద్దును మూసి వేశారు. త్రివేండ్రం – నాగర్‌కోయిల్, కోయంబత్తూర్ – పాలక్కడ్ సరిహద్దులను మూసివేయండంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

అయ్యప్ప దర్శనం కోసం బయలుదేరిన వేలాది మంది భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా సరిహద్దుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News