బులంద్‌షహర్ సీఐ హత్య, అల్లర్లకు కారకుడైన నిందితుడు అరెస్టు

గత ఏడాది డిసెంబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన సామూహిక అల్లర్లకు కారకుడు అవడమే కాకుండా హింసను ప్రేరేపించిన నిందితుడు యోగేష్ రాజ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. గోవధ వదంతులతో డిసెంబర్ 3న అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఐ సుబోధ్ కుమార్ సింగ్‌ను అల్లరి మూకలు అత్యంత దారుణంగా హత్య చేశాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్టు చేశాయి. కాని ఏ1 నిందితుడిగా ఉన్న భజరంగ్‌దళ్ కార్యకర్త […]

Advertisement
Update:2019-01-03 06:50 IST

గత ఏడాది డిసెంబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన సామూహిక అల్లర్లకు కారకుడు అవడమే కాకుండా హింసను ప్రేరేపించిన నిందితుడు యోగేష్ రాజ్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. గోవధ వదంతులతో డిసెంబర్ 3న అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఐ సుబోధ్ కుమార్ సింగ్‌ను అల్లరి మూకలు అత్యంత దారుణంగా హత్య చేశాయి.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్టు చేశాయి. కాని ఏ1 నిందితుడిగా ఉన్న భజరంగ్‌దళ్ కార్యకర్త యోగేష్ రాజ్ ఆచూకీ మాత్రం గత నెల రోజులుగా లభించలేదు. ఘటన జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన యోగేశ్… ఆ తర్వాత పోలీసులకు వీడియోలు కూడా పంపుతుండేవాడు.

అయితే గత రాత్రి యోగేష్ యూపీలోని బులంద్‌షహర్ నుంచి ఖుర్జాకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వలపన్ని ఒక కాలేజీ సమీపంలో అతడిని అదుపులోనికి తీసుకున్నారు.

డిసెంబర్ 3 నాటి హింసకు ప్రధాన కారకుడు యోగేషేనని పోలీసులు ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. యోగేష్ అరెస్టుతో ఈ కేసులో నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు అయింది.

Tags:    
Advertisement

Similar News