సైఫ్ పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు

సైఫ్ పై మహ్మద్ షరీఫుల్ షెహజాద్ దాడి చేసినట్లు డీసీపీ దీక్షిత్ వెల్లడి

Advertisement
Update:2025-01-19 10:38 IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. థానేలో శనివారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులుల వెల్లడించారు. డీసీపీ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. సైఫ్ పై మహ్మద్ షరీఫుల్ షెహజాద్ దాడి చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతను చోరీ చేయడానికే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. నిందితుడిని బంగ్లాదేశీయుడిగా ప్రాథమికంగా గుర్తించామని.. భారతీయుడు అనే దానికి అతని వద్ద సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అతనిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరుతామని తెలిపారు. నిందితుడిని థానేలో శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 

Tags:    
Advertisement

Similar News