పెనుమత్సను తొలగించిన జగన్
విజయనగరం జిల్లా వైసీపీలో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. సీనియర్ నేత పెనుమత్స సాంబశివ రాజును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించినట్టు తెలియడంతో పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. పెనుమత్స స్థానంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల బాధ్యతలు అప్పగిస్తూ జగన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జిల్లా వైసీపీకి తొలి నుంచి అండగా ఉంటున్న పెనుమత్సనే ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో మిగిలిన ఇన్‌చార్జ్ లలోనూ ఆందోళన నెలకొంది. ఐదేళ్ల పాటు జిల్లా పార్టీ […]
విజయనగరం జిల్లా వైసీపీలో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. సీనియర్ నేత పెనుమత్స సాంబశివ రాజును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించినట్టు తెలియడంతో పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. పెనుమత్స స్థానంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల బాధ్యతలు అప్పగిస్తూ జగన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
జిల్లా వైసీపీకి తొలి నుంచి అండగా ఉంటున్న పెనుమత్సనే ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో మిగిలిన ఇన్‌చార్జ్ లలోనూ ఆందోళన నెలకొంది. ఐదేళ్ల పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర పాలక మండలి సభ్యుడిగా సేవలందించిన పెనుమత్సను చివరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించారన్న సమాచారం ఆయన వర్గీయులను దిగ్బ్రాంతికి గురి చేసింది.
2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పెనుమత్స కుమారుడు సురేష్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ బాధ్యతలను పెనుమత్సకు జగన్ అప్పగించారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన్ను తప్పించడం చర్చనీయాంశమైంది. ఆర్ధికంగా బలంగా లేకపోవడం కూడా పెనుమత్సను పక్కన పెట్టడానికి ఒక కారణంగా చెబుతున్నారు.