సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డి అరెస్ట్

సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Update:2025-01-02 19:40 IST

సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్‌లో జరుగుతున్న ఘటనలకు ఆమెనే కారణమని ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి సంఘాలు విద్యార్థులకు మద్దతుగా నిలవడంతో నిన్న రాత్రి.. సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఓ విచారణ కమిటీ వేసినట్లు పోలీసులకు తెలిపింది.

కానీ విద్యార్థుల ఎంతకు తగ్గకపోవడం, వార్డెన్ ప్రీతి రెడ్డి పై అనుమానం తో పాటు ఆరోపణలు చేయడంతో.. గురువారం సాయంత్రం.. ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే బాలికల హాస్టల్ బాత్ రూమ్ పక్కే వంట సిబ్బంది రూమ్ ఉండటంతో.. వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలో కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రీతిరెడ్డిని కాలేజి నుంచి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News