రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్ళి.... సంగీత్ లో ప్రభాస్, అనుష్క ల డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షనట!

ప్రభాస్, అనుష్కలు కలిసి ఎక్కడ కనిపించినా వీళ్లిద్దరి గురించే రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో వున్నారని “బిల్లా” సినిమా నుండీ వినిపిస్తుంది. కానీ ప్రభాస్, అనుష్క మాత్రం ఈ రూమర్స్ ని కొట్టిపడేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు బయట వీళ్లిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా మీడియా ఫోకస్ అంతా వీరిపైనే ఉటుంది. చిన్న ఫొటో గ్రాఫ్ దొరికినా స్టోరీలు అల్లెస్తున్నారు. ఇప్పుడు మరోసారి అఫ్ స్క్రీన్ లో ఈ జంట అడ్డంగా దొరికేశారు. ఇంతకీ అసలు విషయం […]

Advertisement
Update:2018-12-29 13:55 IST

ప్రభాస్, అనుష్కలు కలిసి ఎక్కడ కనిపించినా వీళ్లిద్దరి గురించే రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో వున్నారని “బిల్లా” సినిమా నుండీ వినిపిస్తుంది. కానీ ప్రభాస్, అనుష్క మాత్రం ఈ రూమర్స్ ని కొట్టిపడేస్తూ వస్తున్నారు.

ఇక ఇప్పుడు బయట వీళ్లిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా మీడియా ఫోకస్ అంతా వీరిపైనే ఉటుంది. చిన్న ఫొటో గ్రాఫ్ దొరికినా స్టోరీలు అల్లెస్తున్నారు. ఇప్పుడు మరోసారి అఫ్ స్క్రీన్ లో ఈ జంట అడ్డంగా దొరికేశారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి జైపూర్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ పెళ్ళికి దాదాపు బాహుబలి టీం అంతా వెళ్ళింది. వీరితో పాటు తెలుగు స్టార్ హీరోలు కూడా తరలి వెళ్ళారు. కానీ ఇందులో అనుష్క ప్రభాస్ ల జోడి మాత్రమే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇప్పటి వరకూ బయటికి వచ్చిన ఫొటోస్ లో ప్రభాస్ అనుష్కల గురించే మాట్లాడుకుంటున్నారు. సంగీత్ లో ప్రభాస్, అనుష్క ల డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందట. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటివరకూ వచ్చిన రూమర్స్ ని వీళ్లు త్వరలో నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Tags:    
Advertisement

Similar News