అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు.... కీలక శాఖలు అశోక్ గెహ్లాట్ వద్దే

రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యుటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో గత కొన్ని రోజులుగా మంత్రి వర్గం కూర్పు ఒక కొలిక్కి రాలేదు. పలు శాఖలను తమ వర్గం వారికే కేటాయించాలని ఇరువురూ పట్టుబట్టడంతో వివాదం చెలరేగింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు గత రాత్రి మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు కాంగ్రెస్ అధ్యక్షుడు […]

Advertisement
Update:2018-12-27 07:41 IST

రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యుటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో గత కొన్ని రోజులుగా మంత్రి వర్గం కూర్పు ఒక కొలిక్కి రాలేదు. పలు శాఖలను తమ వర్గం వారికే కేటాయించాలని ఇరువురూ పట్టుబట్టడంతో వివాదం చెలరేగింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు గత రాత్రి మంత్రులకు శాఖలు కేటాయించారు.

ఢిల్లీలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిపిన చర్చల అనంతరం రాత్రి 2.30 గంటలకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే కీలకమైన హోం, ఆర్థిక శాఖలతో పాటు మరో 9 శాఖలను అశోక్ గెహ్లాట్ వద్దే ఉంచుకున్నారు. డిప్యుటీ సీఎం సచిన్‌కు పబ్లిక్ వర్క్స్, గ్రామీణాభివృద్ది, పంచాయితీ రాజ్, శాస్త్ర సాంకేతిక శాఖ, స్టాటిస్టిక్స్ శాఖలను కేటాయించారు.

ఇక మిగిలిన శాఖలను 13 మంది క్యాబినెట్ మంత్రులకు, 10 మంది సహాయ మంత్రులకు కేటాయించారు. అయితే తనకు కేటాయించిన శాఖలపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డిప్యుటీ సీఎంగా ఉన్నా తనకు కీలక శాఖలు ఇవ్వలేదని సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరి ఈ అసంతృప్తి భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News