ఈ ఒక్కటి అదిరింది 'రామ'

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే వెనకబడిన సినిమా వినయ విధేయ రామ. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ చేశారు. మరోవైపు ఎఫ్-2 సినిమా టీజర్ తో దుమ్మురేపుతోంది. సాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది. కానీ వినయ విధేయ రామ మాత్రం సైలెంట్ అయిపోయింది. ఎంత చేస్తున్నా ఈ సినిమాకు హైప్ రావడం లేదు. రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ఫ్లాప్ […]

Advertisement
Update:2018-12-26 13:15 IST

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే వెనకబడిన సినిమా వినయ విధేయ రామ. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ చేశారు.

మరోవైపు ఎఫ్-2 సినిమా టీజర్ తో దుమ్మురేపుతోంది. సాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది. కానీ వినయ విధేయ రామ మాత్రం సైలెంట్ అయిపోయింది.

ఎంత చేస్తున్నా ఈ సినిమాకు హైప్ రావడం లేదు. రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ఫ్లాప్ అయ్యాయి. వీటితో పాటు వచ్చిన స్టిల్స్ కూడా ఎట్రాక్ట్ చేయలేదు. అలా డల్ అయిన సినిమా ప్రమోషన్ ఎట్టకేలకు ఊపందుకుంది. ఈరోజు ఈ మూవీకి సంబంధించి ఓ స్టిల్ రిలీజ్ చేశారు. గుర్రమెక్కిన రామ్ చరణ్ స్టిల్ అది. ఆ ఒక్క ఫొటోతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

రేపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. కేటీఆర్ చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ చేయబోతున్నారు. రాత్రి 9 గంటలకు సోషల్ మీడియాలో ట్రయిలర్ ను విడుదల చేస్తారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News