అఖిల్ ను పట్టించుకోరా..?
సక్సెస్ లేకపోతే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ వృధా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అఖిల్. అక్కినేని నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చిన అఖిల్ ను ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు ఈ కుర్రహీరో. కానీ ఈ మూవీ అప్ డేట్స్ ఆడియన్స్ ను పెద్దగా ఎట్రాక్ట్ చేయట్లేదు. చివరికి ఈ సినిమాలో పాటల్ని కూడా పట్టించుకోవడం లేదు. నిజం చెప్పాలంటే మిస్టర్ మజ్నులో పాటలు బాగున్నాయి. మొదటి […]
సక్సెస్ లేకపోతే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ వృధా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అఖిల్. అక్కినేని నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చిన అఖిల్ ను ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు ఈ కుర్రహీరో. కానీ ఈ మూవీ అప్ డేట్స్ ఆడియన్స్ ను పెద్దగా ఎట్రాక్ట్ చేయట్లేదు. చివరికి ఈ సినిమాలో పాటల్ని కూడా పట్టించుకోవడం లేదు.
నిజం చెప్పాలంటే మిస్టర్ మజ్నులో పాటలు బాగున్నాయి. మొదటి పాట కంటే రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ ఇంకా బాగుంది. తమన్ మంచి బాణీ ఇచ్చాడు. కానీ ఏం లాభం. ప్రస్తుతం అఖిల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కదా. అందుకే పాట బాగున్నప్పటికీ యూట్యూబ్ లో దీనికి అంతంతమాత్రంగానే వ్యూస్ వస్తున్నాయి.
ఇప్పటికి ఈ పాట విడుదలైన 24 గంటలుల దాటిపోయింది. మరో హీరో సినిమా పాటకైతే కనీసం మిలియన్ వ్యూస్ వచ్చి ఉండేవి. కానీ మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ మాత్రం యూట్యూబ్ లో అనాథగా మిగిలింది. అఖిల్ కెరీర్ లో మూడో చిత్రంగా వస్తున్న మిస్టర్ మజ్ను కచ్చితంగా హిట్ అవ్వాలి. లేదంటే అఖిల్ కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది.