అటువంటి సీన్స్ లో నటించను.... ఆ దుస్తులు నాకు సెట్ కావు....

“ప్రేమం” అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీ కి పరిచయం అయిన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. ఇప్పటికే తెలుగులో “ఫిదా” సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ భామ ప్రస్తుతం తెలుగు లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి గ్లామర్ షో కి, ముద్దు సీన్స్ కి దూరం అని చెబుతోంది. తాను లిప్ లాక్ […]

Advertisement
Update:2018-12-24 06:08 IST

“ప్రేమం” అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీ కి పరిచయం అయిన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది.

ఇప్పటికే తెలుగులో “ఫిదా” సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన ఈ భామ ప్రస్తుతం తెలుగు లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి గ్లామర్ షో కి, ముద్దు సీన్స్ కి దూరం అని చెబుతోంది. తాను లిప్ లాక్ సీన్స్ లో నటించను అని తేల్చి చెప్పింది సాయి పల్లవి.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పింది సాయి పల్లవి…. “చిన్న చిన్న దుస్తులు వేసుకొని నటించడం నా వల్ల కాదు. అలాగని నేను వాటికి వ్యతిరేకమూ కాదు. అటువంటి వాటిలో తప్పేమి లేదు. కాకపొతే నాకు అవి సౌకర్యంగా ఉండవు….అందుకే నా దగ్గరకి ఎవ్వరూ లిప్ లాక్ సీన్స్ పట్టుకొని రాకండి” అని తన మనసులోని మాటని చెప్పింది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News