ఆ జిల్లాకు మంత్రి పదవులు అచ్చిరావడం లేదా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ప్రజా జీవితంలో ఉండే నేతలకు మంత్రిపదవులు అచ్చిరావడం లేదని టాక్ విన్పిస్తోంది. 2014, 2018 ఎన్నికల ఫలితాలను పరిశీలించిన నేతలు ఇప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఇద్దరు నేతలు అప్పటివరకూ మంత్రులుగా పనిచేశారు. కానీ ఎన్నికల తర్వాత వీరి జాతకం మారిపోయింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో వీరి రాజకీయ భవిష్యత్ […]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ప్రజా జీవితంలో ఉండే నేతలకు మంత్రిపదవులు అచ్చిరావడం లేదని టాక్ విన్పిస్తోంది. 2014, 2018 ఎన్నికల ఫలితాలను పరిశీలించిన నేతలు ఇప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఇద్దరు నేతలు అప్పటివరకూ మంత్రులుగా పనిచేశారు. కానీ ఎన్నికల తర్వాత వీరి జాతకం మారిపోయింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో వీరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. బస్వరాజు సారయ్య టీఆర్ఎస్‌కు జంప్ అయ్యారు. అక్కడ ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాలేదు. ఇటు పొన్నాల కూడా ఈ ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ మంత్రులకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. ములుగు నుంచి పోటీ చేసిన మంత్రి చందూలాల్ ఓడిపోయారు. అటు స్పీకర్ మధుసూదనాచారి కూడా పరాజయం పాలయ్యారు. వీరి ఇద్దరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. మరోవైపు డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరికి ఇప్పుడు మంత్రి పదవి దక్కుతుందా? లేదా అనేది వేచి చూడాలి.
మంత్రి పదవులు ఈ జిల్లాకు అచ్చిరావడం లేదని నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రిపదవులతో బిజీగా మారడం వల్ల గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలకు దూరం కావాల్సి వస్తుందని విశ్లేషించుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో పట్టుకోల్పోయి ఓడిపోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు. మరీ ఈ సారి ఓరుగల్లు నుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో… వారి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.