ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులు... యువతి ఆత్మహత్య
ఎన్‌ఆర్ఐ భర్త వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న మారుతితో కొంతకాలం క్రితం సికింద్రాబాద్‌కు చెందిన నాగమణికి పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు కూడా సమర్పించారు. అయినా సరే పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు మారుతి. వేధింపులు భరించలేక మూడు రోజుల క్రితం నాగమణి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు […]
ఎన్‌ఆర్ఐ భర్త వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంది.
లండన్‌లో ఉద్యోగం చేస్తున్న మారుతితో కొంతకాలం క్రితం సికింద్రాబాద్‌కు చెందిన నాగమణికి పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు కూడా సమర్పించారు. అయినా సరే పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు మారుతి.
వేధింపులు భరించలేక మూడు రోజుల క్రితం నాగమణి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూసింది. నాగమణికి వీఆర్‌ఏ ఉద్యోగం కూడా వచ్చింది. సికింద్రాబాద్‌లో ఈమె వీఆర్‌ఏగా పనిచేస్తుండేవారు.
ఇటీవల మ్యారేజ్ డే సందర్భంగా ఇండియాకు వచ్చిన మారుతి భార్యను డబ్బు కోసం వేధించాడు. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. నాగమణి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రోజు మారుతిపై ఆమె తమ్ముడు కోపంలో చేయి చేసుకున్నాడు. దీంతో నాగమణి తమ్ముడిపై మారుతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇప్పుడు నాగమణి చనిపోవడంతో మారుతి ఎస్కేప్ అయ్యాడు. వెంటనే అతడి పాస్‌పోర్టును రద్దు చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మారుతి పారిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మారుతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఆత్మహత్యకు మారుతి ఎంత వరకు కారణమన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.