హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారు.... ఏప్రిల్ 7నుంచి ఏపీలో హైకోర్టు సేవలు!
హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగున్నరేళ్లుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టును కూడా విభజించాలంటూ తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే…. వెంటనే హైకోర్టు విభజన పూర్తి చేస్తామని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దీంతో వచ్చే వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీని […]
హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగున్నరేళ్లుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది.
రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టును కూడా విభజించాలంటూ తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే…. వెంటనే హైకోర్టు విభజన పూర్తి చేస్తామని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది.
అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దీంతో వచ్చే వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీని ఏపీ హైకోర్టు అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉమ్మడిగా ఉన్న హైకోర్టు…. ఇక నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టుగా విడిపోనుంది.
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. కోర్టుతోపాటు న్యాయవాదల విభజన జరగాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితమే న్యాయమూర్తుల విభజనతో పాటు సిబ్బంది విభజన కూడా పూర్తయ్యింది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు భవనం పూర్తయితే…. హైకోర్టును ఏపీలోనూ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అమరావతిలో నేలపాడు గ్రామంలో హైకోర్టు నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ నిర్మాణాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తులంతా పరిశీలించి… సంతృప్తి వ్యక్తం చేస్తూ…. నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించారు.
ఇక అధికారికంగా ఏపీ హైకోర్టు 2019, ఏప్రిల్ 7వ తేదీన పని చేయటం ప్రారంభిస్తుంది. ఏప్రిల్ 7వ తేదీ ఉగాది కావటంతో…ఆనాటి నుంచే హైకోర్టు అపాయింటెడ్ డేగా ప్రకటిస్తూ…రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు.