పెర్త్ టెస్టులో టీమిండియాకు కంగారూ ఎర్త్
లయన్ స్పిన్ మ్యాజిక్ లో విరాట్ సేన గల్లంతు 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం ఆఖరిరోజు ఆటలో 140 పరుగులకే టీమిండియా ఆలౌట్ మెల్బోర్న్ వేదికగా 26 నుంచి మూడో టెస్ట్ ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా… పెర్త్ ఆప్టస్ స్టేడియంలో జరిగిన రెండోటెస్టు ఆఖరిరోజు ఆట ప్రారంభంలోనే … టాప్ ర్యాంకర్ టీమిండియా చిత్తుగా ఓడింది. 287 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. […]
- లయన్ స్పిన్ మ్యాజిక్ లో విరాట్ సేన గల్లంతు
- 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
- ఆఖరిరోజు ఆటలో 140 పరుగులకే టీమిండియా ఆలౌట్
- మెల్బోర్న్ వేదికగా 26 నుంచి మూడో టెస్ట్
ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా… పెర్త్ ఆప్టస్ స్టేడియంలో జరిగిన రెండోటెస్టు ఆఖరిరోజు ఆట ప్రారంభంలోనే … టాప్ ర్యాంకర్ టీమిండియా చిత్తుగా ఓడింది. 287 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది.
146 పరుగుల విజయం సాధించడం ద్వారా… ఆతిథ్య ఆస్ట్రేలియా.. మొదటి రెండు టెస్టులు ముగిసే నాటికి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. కంగారూ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీమిండియా బోల్తా….
ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో… టాప్ ర్యాంకర్, హాట్ ఫేవరెట్ టీమిండియాకు తొలిషాక్ తగిలింది. గతవారం అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో కంగారూ టీమ్ ను 31 పరుగులతో ఓడించడం ద్వారా…. 1-0 ఆధిక్యం సాధించిన విరాట్ సేన ఆనందం… రెండో టెస్ట్ ఓటమితో ఆవిరైపోయింది.
ఆఖరి రోజున టపటపా…
పెర్త్ లో సరికొత్తగా నిర్మించిన ఆప్టస్ స్టేడియం వేదికగా… ముగిసిన రెండోటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 287 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా…ఆఖరి రోజు ఆట మొదటి గంటలోనే.. కేవలం 56 ఓవర్లలోనే 140 పరుగులకే కుప్పకూలింది.
ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 112 పరుగుల స్కోరుతో ఆఖరిరోజు ఆటను కొనసాగించిన టీమిండియా…. పేకమేడలా కూలింది. మిడిలార్డర్ ఆటగాళ్లు హనుమ విహారీ 28, రిషభ్ పంత్ 30 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతోనే టీమిండియా ఓటమి ఖాయమైపోయింది.
లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఉమేశ్ యాదవ్ 2 పరుగులు, ఇశాంత్ శర్మ, బుమ్రా డకౌట్లుగా వెనుదిరిగారు. కంగారూ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ స్టార్క్ 3, ఆఫ్ స్పిన్నర్ నేథలన్ లయన్ 3 వికెట్లు , హేజిల్ వుడ్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లయన్ మ్యాజిక్….
రెండు ఇన్నింగ్స్ లో కలసి 8 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ లయన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 146 పరుగుల విజయంతో ఆతిథ్య ఆస్ట్రేలియా…అడిలైడ్ టెస్ట్ ఓటమికి బదులుతీర్చుకోడం ద్వారా…1-1తో టీమిండియాతో సమఉజ్జీగా నిలువగలిగింది.
కంగారూ కళకళ… టీమిండియా వెలవెల…
ఆస్ట్రేలియా టెయిల్ ఎండర్లు…మొత్తం 519 బాల్స్ ఎదుర్కొని 252 పరుగులు సాధిస్తే….టీమిండియా టెయిల్ ఎండర్లు 228 బాల్స్ ఎదుర్కొని… కేవలం 63 పరుగులు మాత్రమే స్కోరుకు జతచేయడం.. టీమిండియా ఓటమికి ఓ కారణమైతే…స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉన్న పెర్త్ వికెట్ పై నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పోటీకి దిగడం… ప్రధాన కారణంగా ఉంది.
తప్పులు దిద్దుకోని టీమ్ మేనేజ్ మెంట్….
చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కొహ్లీ…పెర్త్ టెస్టు తుదిజట్టు ఎంపికలో మరోసారి ఘోరమైన తప్పిదమే చేశారు. గత ఇంగ్లండ్ టూర్ లో సైతం…పేసర్ కు బదులు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుదిజట్టులో తీసుకొని…. చేతులు కాల్చుకొన్న భారత టీమ్ మేనేజ్ మెంట్…చేసిన తప్పులను తెలుసుకోనంతకాలం విదేశీ టూర్లలో ఇలాంటి పరాజయాలు తప్పవు.
సిరీస్ లోని మూడోటెస్ట్ మ్యాచ్…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ వేదికగా ఈనెల 26న ప్రారంభంకానుంది.