కాస్టింగ్ కౌచ్ పై అదితిరావు స్పందన

హీరోయిన్లంతా కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా రియాక్ట్ అవుతున్న రోజులివి. హీరోయిన్ల నుంచి చాలామంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పూసగుచ్చినట్టు బయటపెడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ అంశంపై హీరోయిన్ అదితిరావు కూడా రియాక్ట్ అయింది. గతంలో ఓసారి ఇదే అంశంపై స్పందించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. “కాస్టింగ్ కౌచ్ పై ఎవరో ఒకర్ని నిందించడం అనవసరం. అలా చేయడం వల్ల పెద్దగా […]

Advertisement
Update:2018-12-18 07:19 IST

హీరోయిన్లంతా కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా రియాక్ట్ అవుతున్న రోజులివి. హీరోయిన్ల నుంచి చాలామంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పూసగుచ్చినట్టు బయటపెడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ అంశంపై హీరోయిన్ అదితిరావు కూడా రియాక్ట్ అయింది. గతంలో ఓసారి ఇదే అంశంపై స్పందించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

“కాస్టింగ్ కౌచ్ పై ఎవరో ఒకర్ని నిందించడం అనవసరం. అలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. ఈ విషయంలో మారాల్సింది మహిళలే. మనం ఎంత బలంగా ఉంటే, కాస్టింగ్ కౌచ్ ఘటనలు అంతలా తగ్గుముఖం పడతాయి. ఈ విషయంలో అవకాశాల గురించి ఆలోచించకూడదు, ఇది సినిమాలకు సంబంధించిన మేటర్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కు సంబంధించిన మేటర్” ఇలా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అదితిరావు.

అంతరిక్షం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ భామ మీ-టూ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తూనే.. ఒక్క సినిమా పరిశ్రమనే కాస్టింగ్ కౌచ్ కింద చూడొద్దని రిక్వెస్ట్ చేస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, ఈ విషయంలో మహిళలే ధైర్యంగా ఉండాలని పిలుపునిస్తోంది.

Tags:    
Advertisement

Similar News