కాజల్ కి అలాంటి భర్తే కావాలట

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పైనే అయింది. అయినా కూడా ఇప్పటికీ అటు స్టార్ హీరోస్ తో పాటు…. ఇటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తోంది కాజల్ అగర్వాల్. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ రెండేళ్ళ క్రితమే పెళ్లి చేసుకొని… ఇప్పుడు ఒక బాబుతో హ్యాపి గా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే నిషాకి పెళ్లి అయినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ కి కూడా పెళ్లి […]

Advertisement
Update:2018-12-17 09:39 IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పైనే అయింది. అయినా కూడా ఇప్పటికీ అటు స్టార్ హీరోస్ తో పాటు…. ఇటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తోంది కాజల్ అగర్వాల్.

కాజల్ చెల్లి నిషా అగర్వాల్ రెండేళ్ళ క్రితమే పెళ్లి చేసుకొని… ఇప్పుడు ఒక బాబుతో హ్యాపి గా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

అయితే నిషాకి పెళ్లి అయినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ కి కూడా పెళ్లి చేసుకోవాలి అనే ఆసక్తి పెరిగిందట. కానీ ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అలాంటి ఆలోచనలని దూరం పెట్టిందట కాజల్ అగర్వాల్.

ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తరువాత పెళ్లి పై మనసు పారేసుకుంది కాజల్. తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పింది కాజల్ అగర్వాల్.

నేను మాత్రమే నా భర్తకి అతి ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. ఇంటి పనుల్లో సాయంగా ఉంటూ…. నన్ను సంతోషంగా చూసుకోవాలి. నిజంగా ప్రేమించాలి, ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలి…. అని కాజల్ తనకు ఎలాంటి భర్త కావాలో వివరంగా చెప్పింది.

Tags:    
Advertisement

Similar News