మళ్లీ జలమయం అయిన అసెంబ్లీ.... జగన్‌ చాంబర్‌లో జలపాతం

వర్షాలు కురవని గ్రహాల్లో వాడాల్సిన టెక్నాలజీని అమరావతిలో వాడినట్టుగా ఉన్నారు. వర్షం వస్తే చాలు అంతరాత్జీయ టెక్నాలజీతో కట్టామని చెప్పుకుంటున్న ఏపీ అసెంబ్లీ జలమయం అవుతోంది. అసెంబ్లీ నిర్మాణ నాణ్యతలో డొల్లతనం కారణంగా…. టీడీపీ నేతలు ఓ వరుణ దేవా…. అసెంబ్లీ వైపు రావొద్దు అని వేడుకునే పరిస్థితి. తాజాగా పెథాయ్ తుపాన్‌ కారణంగా అమరావతి ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం కారణం మరోసారి అసెంబ్లీలోకి వర్షం నీరు చొరబడింది. పలు చాంబర్లలోకి వర్షపు ధార […]

Advertisement
Update:2018-12-17 06:47 IST

వర్షాలు కురవని గ్రహాల్లో వాడాల్సిన టెక్నాలజీని అమరావతిలో వాడినట్టుగా ఉన్నారు. వర్షం వస్తే చాలు అంతరాత్జీయ టెక్నాలజీతో కట్టామని చెప్పుకుంటున్న ఏపీ అసెంబ్లీ జలమయం అవుతోంది.

అసెంబ్లీ నిర్మాణ నాణ్యతలో డొల్లతనం కారణంగా…. టీడీపీ నేతలు ఓ వరుణ దేవా…. అసెంబ్లీ వైపు రావొద్దు అని వేడుకునే పరిస్థితి. తాజాగా పెథాయ్ తుపాన్‌ కారణంగా అమరావతి ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వర్షం కారణం మరోసారి అసెంబ్లీలోకి వర్షం నీరు చొరబడింది. పలు చాంబర్లలోకి వర్షపు ధార వచ్చిపడుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చాంబర్‌ కూడా జలమయమైంది.

గతంలో జగన్‌ చాంబర్‌లోకి ఇలాగే వర్షం నీరు రాగా… దాని వెనుక కుట్ర ఉందని… ఎవరో పైపులు కోశారని అందులో నీరు వచ్చిందంటూ స్పీకర్‌తో పాటు టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. అయితే ఆ తరువాత వచ్చిన వర్షాలకు అనేక మంది మంత్రుల చాంబర్లలోకి కూడా వర్షపు నీరు రావడంతో ఆ విమర్శలు ఆగిపోయాయి.

కానీ ఇప్పుడు మరోసారి జగన్‌ చాంబర్‌లోకి వర్షపు నీరు లీకవుతుండడంతో నిర్మాణం ఎంత లోపభూయిష్టంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Tags:    
Advertisement

Similar News