టీడీపీలో చేరుతారనుకుంటే.... జస్టిస్ బాలయోగి రాజీనామా విత్ డ్రా
హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బాలయోగి తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. తిరిగి విధుల్లో చేరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరానికి చెందిన బాలయోగి ఇటీవల న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామా ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతలో మనసు మార్చుకున్న బాలయోగి తన రాజీనామాను విత్ డ్రా చేసుకున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజీనామా సమర్పించినప్పుడు… అది ఫలానా తేది నుంచి అమలులోకి […]
హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బాలయోగి తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. తిరిగి విధుల్లో చేరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరానికి చెందిన బాలయోగి ఇటీవల న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామా ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇంతలో మనసు మార్చుకున్న బాలయోగి తన రాజీనామాను విత్ డ్రా చేసుకున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజీనామా సమర్పించినప్పుడు… అది ఫలానా తేది నుంచి అమలులోకి వస్తుందని నోటిఫికేషన్ ఇస్తే ఆ లోపు దాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దాంతో జస్టిస్ బాలయోగి తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. 2019 జనవరి 14 వరకు ఆయన పదవీ కాలం ఉంది.
ఇటీవల రాజీనామా చేసిన బాలయోగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వార్తలొచ్చాయి. రాజీనామా చేసిన తర్వాత అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని బాలయోగి కలవడంతో ఆయన టీడీపీలో చేరుతారని భావించారు. అమలాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇంతలో ఆయన తిరిగి రాజీనామాను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశమైంది.