50 కోట్ల క్లబ్ లో చేరిన 2.O

తెలుగులో ఎట్టకేలకు 50 కోట్ల క్లబ్ లో చేరింది రజనీకాంత్ నటించిన 2.O సినిమా. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి నెగెటివ్ టాక్ కారణంగా టాలీవుడ్ లో వసూళ్లు బాగా పడిపోయాయి. విడుదలైన మొదటి వారానికే 50 కోట్లు వస్తాయని భావించిన మేకర్స్ కు, ఆ 50 కోట్లు సంపాదించడానికి అక్షరాలా 16 రోజులు పట్టింది. మొత్తానికి కిందామీదా పడి 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాకు ఇక […]

Advertisement
Update:2018-12-15 15:49 IST

తెలుగులో ఎట్టకేలకు 50 కోట్ల క్లబ్ లో చేరింది రజనీకాంత్ నటించిన 2.O సినిమా. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి నెగెటివ్ టాక్ కారణంగా టాలీవుడ్ లో వసూళ్లు బాగా పడిపోయాయి. విడుదలైన మొదటి వారానికే 50 కోట్లు వస్తాయని భావించిన మేకర్స్ కు, ఆ 50 కోట్లు సంపాదించడానికి అక్షరాలా 16 రోజులు పట్టింది.

మొత్తానికి కిందామీదా పడి 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాకు ఇక నష్టాలు తప్పవని తేలిపోయింది. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే ఈ సినిమా మరో 22 కోట్ల రూపాయలు ఆర్జించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2.O సినిమా మరో 22 కోట్లు సంపాదించడం దాదాపు అసాధ్యం.

ఉన్నంతలో సంతోషించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది…. ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడమే. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా ఈ ఘనత సాధించలేకపోయింది. 2.O మాత్రమే ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటితో 16 రోజుల రన్ పూర్తిచేసుతున్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 23 కోట్లు
సీడెడ్ – 7.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.35 కోట్లు
ఈస్ట్ – 3.66 కోట్లు
వెస్ట్ – 2.52 కోట్లు
గుంటూరు – 3.61 కోట్లు
కృష్ణా – 2.89 కోట్లు
నెల్లూరు – 1.82 కోట్లు

Tags:    
Advertisement

Similar News