కేసీఆర్ రెడీ.... ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవులు ఔట్

కేసీఆర్ రెడీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాలనపగ్గాలు చేపట్టడంతోనే ఆయన మొదట తీసుకునే చర్య…. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడమేనని గురువారం టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సీఎంగా కేసీఆర్ మధ్యాహ్నం ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి స్పీకర్ ను టీఆర్ఎస్ నాయకులు కోరనున్నారు. […]

Advertisement
Update:2018-12-13 06:31 IST

కేసీఆర్ రెడీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాలనపగ్గాలు చేపట్టడంతోనే ఆయన మొదట తీసుకునే చర్య…. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడమేనని గురువారం టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

సీఎంగా కేసీఆర్ మధ్యాహ్నం ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, కొండా మురళిలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి స్పీకర్ ను టీఆర్ఎస్ నాయకులు కోరనున్నారు. ఈ మేరకు కేసీఆర్ కూడా ఈ విషయంలో తొందరగా ఉన్నారని తెలిసింది.

ఈ నేపథ్యంలో పార్టీలు మారిన భూపతిరెడ్డి, రాముల్ నాయక్, కొండా మురళిల పదవులు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. భూపతిరెడ్డి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ సీటు కోసం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బండ్ల గణేష్ తో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇక కొండా మురళి.. సురేఖతో కలిసి సీట్ల సర్ధుబాట్లపై నిరసనగా టీఆర్ఎస్ పై అసమ్మతి రాజేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి సురేఖ పరకాలలో పోటీచేశారు. కానీ ఈసారి ఎన్నికల్లో కొండా సురేఖ ఓడిపోయారు. ఇప్పుడు భర్త ఎమ్మెల్సీ మురళి పదవి కూడా పోనుంది.

ఇక రాములు నాయక్ కూడా కేసీఆర్ తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు అలిగి పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను కలిసి లాబీయింగ్ చేశారు. ఇది తెలిసి టీఆర్ఎస్ వేటు వేయగా… టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై నోరుపారేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు.

ఇప్పుడు ఈ ముగ్గురిపై కేసీఆర్ అధికారం చేపట్టగానే అనర్హత వేటు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ చకచకా పావులు కదుపుతోందట…. దీంతో అటు కాంగ్రెస్ లో గెలవక, ఇటు టీఆర్ఎస్ పై ఆరోపణలు చేసి…. వారు ఎటూ కాకుండా పోయారు.

Tags:    
Advertisement

Similar News