రేపు ఉత్తమ్‌కు సినిమా కనిపిస్తుంది.... టీఆర్ఎస్ కు మా మద్దతు అవసరం ఉండదు....

తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్‌తో దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన అసద్‌…. టీఆర్‌ఎస్‌ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుంటుందన్నారు. ఎంఐఎం అవసరం లేకుండానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. అయినప్పటికీ తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మహాకూటమినే […]

Advertisement
Update:2018-12-10 12:30 IST

తెలంగాణలో తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్‌తో దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన అసద్‌…. టీఆర్‌ఎస్‌ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

టీఆర్‌ఎస్ భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుంటుందన్నారు. ఎంఐఎం అవసరం లేకుండానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. అయినప్పటికీ తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మహాకూటమినే తొలుత పిలవాలంటూ ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కూటమి నేతలు గవర్నర్‌ను కలవడంపై స్పందించిన ఓవైసీ… ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి రేపు అసలు సినిమా కనిపిస్తుందన్నారు.

కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదించారని…. తెలంగాణ అభివృద్ది కోసం, జాతి ప్రయోజనాల కోసం తాము కేసీఆర్‌తోనే ఉంటామన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చాటేందుకే తాను బుల్లెట్‌పై కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానని అసదుద్దీన్‌ వివరించారు.

రేపు కేసీఆర్‌ను తాను మరోసారి కలుస్తానని అసద్ చెప్పారు. మొన్నటి వరకు ఎంఐఎంను బీజేపీకి బీ టీం అంటూ ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడెలా ఎంఐఎం మద్దతు అడుగుతారని ఓవైసీ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News