కోటికి కోటి... భలే లాభం

సుబ్రహ్మణ్యపురం సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. హీరో రెమ్యూనరేషన్ ను పక్కనపెడితే, సినిమాకు కోటి రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పుడా కోటి రూపాయలు కేవలం ఒకే ఒక్క డీల్ తో నిర్మాతలకు తిరిగొచ్చేసింది. అదే శాటిలైట్, డిజిటల్ రైట్స్. అవును.. సుబ్రహ్మణ్యపురం సినిమా కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. అలా పెట్టిన పెట్టుబడి మొత్తం కేవలం ఈ ఒక్క డీల్ తోనే వచ్చేసింది. ప్రస్తుతం […]

Advertisement
Update:2018-12-09 10:03 IST

సుబ్రహ్మణ్యపురం సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. హీరో రెమ్యూనరేషన్ ను పక్కనపెడితే, సినిమాకు కోటి రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పుడా కోటి రూపాయలు కేవలం ఒకే ఒక్క డీల్ తో నిర్మాతలకు తిరిగొచ్చేసింది. అదే శాటిలైట్, డిజిటల్ రైట్స్.

అవును.. సుబ్రహ్మణ్యపురం సినిమా కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. అలా పెట్టిన పెట్టుబడి మొత్తం కేవలం ఈ ఒక్క డీల్ తోనే వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. దీంతో థియేట్రికల్ గా కూడా ఈ సినిమా లాభాలు కళ్లజూసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఓవర్సీస్ లో మాత్రం సుబ్రహ్మణ్యపురం ఫ్లాప్ అయింది.

తాజా డీల్ తో సుమంత్ రేంజ్ కాస్త పెరిగినట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు సుమంత్ నటించిన ఏ సినిమాకు శాటిలైట్ రూపంలో ఇంత మొత్తం రాలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో సుమంత్ నటించిన కొన్ని సినిమాలు శాటిలైట్ కు కూడా నోచుకోలేదు.

Tags:    
Advertisement

Similar News