పిల్లల రక్తం పీల్చే వ్యక్తి నారాయణ

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… టీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే ఆ గెలుపును చంద్రబాబుకు అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ నేత విల్సన్. చంద్రబాబు విషయంలో మహాకూటమిని కేసీఆర్‌ చాలా తెలివిగా దెబ్బ కొట్టగలిగారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అంశం సామాన్య జనంలో బాగా ప్రభావం చూపిందన్నారు. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించాలని ప్రజలు అనుకున్నారని…. కానీ చంద్రబాబు రాగానే ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మళ్లారన్నారు. మందకృష్ణ మాదిగ, ఆర్‌ కృష్ణయ్యలను కాంగ్రెస్‌, టీడీపీలు శిఖండులుగా అడ్డుపెట్టుకుని ఎన్నికల […]

Advertisement
Update:2018-12-09 06:14 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… టీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే ఆ గెలుపును చంద్రబాబుకు అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ నేత విల్సన్. చంద్రబాబు విషయంలో మహాకూటమిని కేసీఆర్‌ చాలా తెలివిగా దెబ్బ కొట్టగలిగారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అంశం సామాన్య జనంలో బాగా ప్రభావం చూపిందన్నారు. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించాలని ప్రజలు అనుకున్నారని…. కానీ చంద్రబాబు రాగానే ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మళ్లారన్నారు.

మందకృష్ణ మాదిగ, ఆర్‌ కృష్ణయ్యలను కాంగ్రెస్‌, టీడీపీలు శిఖండులుగా అడ్డుపెట్టుకుని ఎన్నికల యుద్ధానికి వెళ్లడం కూడా వ్యూహాత్మక తప్పిదమేనన్నారు. మందకృష్ణ మాదిగ చంద్రబాబు ఏజెంట్‌ అని…. చంద్రబాబు వల్లే కూటమికి మందకృష్ణ మద్దతు ఇచ్చారన్నారు. అసలు మందకృష్ణను చూసి ఓటేసే జనం ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ఆర్‌. కృష్ణయ్య నిజంగా బీసీ నాయకుడై ఉంటే బీసీల కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చిన బీజేపీకి మద్దతు తెలపాల్సిందన్నారు. కానీ టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. బీసీల పేరు చెప్పి ఆర్‌. కృష్ణయ్య కోట్లాది రూపాయలు సంపాదించారని విల్సన్ వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ వైపు జనం నిలబడ్డారన్నారు. అందువల్లే పోలింగ్ శాతం పెరిగి ఉండవచ్చన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఆ గెలుపును చంద్రబాబుకు అంకితం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రయత్నాలు వృథా అయ్యాయని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ప్రచారం మహాకూటమికి నష్టాన్ని తెచ్చిందన్నారు. ప్రచారంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సాధారణంగానే బాలకృష్ణను కమెడియన్‌లా ప్రజలు చూస్తుంటారన్నారు. ఆయన మాట్లాడే తీరు చూసినా కామెడీ ఉంటుందన్నారు విల్సన్‌.

Tags:    
Advertisement

Similar News