తెలంగాణలో ఓట్ల గల్లంతు.. వెనుక ఎవరున్నారు?
తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది యాక్టివ్ గా ఉండే ప్రజలు, నేతలు, ప్రముఖుల ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఈ పరిణామం కేవలం తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి. సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓటేసే వారి పేర్లు కూడా తాజాగా తెలంగాణ ఎన్నికల్లో గల్లంతు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆన్ లైన్ లో ఓటు ఉన్నట్లు ఓటరు స్లిప్ తీసుకున్న వారు ఓటేసేందుకు వెళ్లగా బూతుల్లో ఓటు లేకపోవడం గమనార్హం. […]
తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది యాక్టివ్ గా ఉండే ప్రజలు, నేతలు, ప్రముఖుల ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఈ పరిణామం కేవలం తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి. సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓటేసే వారి పేర్లు కూడా తాజాగా తెలంగాణ ఎన్నికల్లో గల్లంతు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆన్ లైన్ లో ఓటు ఉన్నట్లు ఓటరు స్లిప్ తీసుకున్న వారు ఓటేసేందుకు వెళ్లగా బూతుల్లో ఓటు లేకపోవడం గమనార్హం.
స్టార్ షట్లర్ గుత్తా జ్వాల నిన్న తన ఓటు గల్లంతైందని వాపోయింది. తన తండ్రి, చెల్లి ఓటు కూడా లేదని… మా అమ్మ ఓటు మాత్రం ఉందని తెలిపింది. 12 సంవత్సరాలుగా తాను హైదరాబాద్ లోని ఒకే నివాసంలో ఉంటున్నా తన పేరును తీసేశారని పేర్కొంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘ఢిల్లీలో 30 లక్షల మంది ఓటర్లను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని…. ఇలానే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తీసేసిందని…. ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు చేస్తోందని’ కేజ్రీవాల్ ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలకు 20 రోజుల ముందు వరకూ ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నా చివరకు పోల్ చిట్టీలలో పేరు లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.
ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్ లో చాలా మంది ఓట్లు గల్లంతై ఓటు వేయలేకపోయారని…. 2019లో లోక్ సభతోపాటు 4 రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో నైనా ఎన్నికల కమిషన్ అందరికీ ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.