తెలంగాణలో పెరిగిన ఎండలు

ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు వేసవిని తలపిస్తున్నాయి.

Advertisement
Update:2025-02-05 16:22 IST

తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 36 డిగ్రీలు వరుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాధారణం కన్న 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నిన్నటి వరకూ చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఉక్కపోతతో అలమటిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచే ఎండల తీవత్ర అధికంగా ఉంది. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల వరకూ ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గకపోవడంతో హైదరాబాద్ నగరంలో అనేక రహదారులు మధ్యాహ్నానికి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News