పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌

గత కొంతకాలంగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న యువ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే ట్విట్టర్లో తన ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు ఈ ‘ఉయ్యాల జంపాల’ హీరో. గతంలో రాజ్ తరుణ్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటిపై స్పందించకపోయినా, పెళ్లి విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తానే […]

Advertisement
Update:2018-12-06 11:00 IST

గత కొంతకాలంగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న యువ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే ట్విట్టర్లో తన ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు ఈ ‘ఉయ్యాల జంపాల’ హీరో.

గతంలో రాజ్ తరుణ్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటిపై స్పందించకపోయినా, పెళ్లి విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తానే స్వయంగా చెప్పాడు.

ఒక అభిమాని “ఎవరినైనా లవ్ చేస్తున్నావా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు” అని అడగగా వచ్చే ఏడాది లో తన వివాహం జరుగుతుందని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే విషయం మాత్రం బయట పెట్టలేదు.

ఇక మరొక ఫ్యాన్ మహేష్ బాబుతో ఫొటో దిగి షేర్ చేయొచ్చుకదా అని చెప్పగా, “ఆయన్ను కలిశాను, ఫొటో కూడా దిగాను. కానీ అది సోషల్ మీడియాలో షేర్ చేయను. ఎందుకంటే అది నా పర్సనల్. నేను చచ్చిపోయేటప్పుడు కూడా అది నాతోనే ఉంటుంది” అని సమాధానం ఇచ్చాడు.

తన తదుపరి చిత్రం గురించి ప్రశ్నించిన ఒక అభిమానికి, మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని, దొరికితే మంచి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపాడు. ఎప్పుడూ ఒకటే ఫొటోను ట్విట్టర్లో పెడతారు మార్చవచ్చుగా అని అడగగా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు తీసిన ఫొటో అది. నేనెప్పటికీ దానిని మార్చను. సారీ అని ఖరాకండిగా చెప్పేసాడు.

Tags:    
Advertisement

Similar News