కథానాయకుడు ట్రయిలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసింది ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పాటల విడుదల వేడుక కూడా షురూ చేసింది. కథానాయక అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇదే ఊపులో ఏకంగా ట్రయిలర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 16న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. 16వ తేదీన భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి తిరుపతిని […]

Advertisement
Update:2018-12-06 12:30 IST

మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసింది ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పాటల విడుదల వేడుక కూడా షురూ చేసింది. కథానాయక అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇదే ఊపులో ఏకంగా ట్రయిలర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 16న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.

16వ తేదీన భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి తిరుపతిని వేదికగా ఎంచుకున్నారు. బాలయ్య డేట్స్ బట్టి కార్యక్రమ వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఈవెంట్ రద్దయితే, ట్రయిలర్ ను మాత్రం అదే రోజు విడుదల చేయడానికి అంతా ఫిక్స్ అయ్యారు.

ఎందుకంటే బాలయ్యకు ముహూర్తాల పిచ్చి అనే విషయం అందరికీ తెలిసిందే కదా. పైగా తనే నిర్మాతగా మారి తీస్తున్న సినిమా ఇది. అందుకే ట్రయిలర్ లాంఛ్ కు కూడా బాలయ్య 16వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశాడు. సో.. ఆ రోజు కార్యక్రమం ఉన్నా, లేకున్నా ట్రయిలర్ మాత్రం రిలీజ్ అయిపోతుంది. జనవరి 9న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో తమన్న లేదనే విషయాన్ని యూనిట్ నిర్థారించింది. జయప్రద పాత్ర కోసం తమన్న స్థానంలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్న విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News