బాబు సొంత జిల్లాలో టీడీపీకి మరో షాక్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీకి మరో దెబ్బ తగిలింది. పార్టీలో దశాబ్దాలుగా పని చేస్తున్న ఇక్బాల్ తెలుగుదేశంకు రాజీనామా చేశాడు. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడని తెలుస్తోంది. ఈయన పీలేరు నియోజక వర్గానికి చెందిన నేత. గత ఎన్నికల్లో ఇతను టీడీపీ తరఫున పోటీ చేశాడు. అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి వ్యక్తి గత కొన్నాళ్లుగా […]

Advertisement
Update:2018-12-06 11:14 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీకి మరో దెబ్బ తగిలింది. పార్టీలో దశాబ్దాలుగా పని చేస్తున్న ఇక్బాల్ తెలుగుదేశంకు రాజీనామా చేశాడు. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడని తెలుస్తోంది.

ఈయన పీలేరు నియోజక వర్గానికి చెందిన నేత. గత ఎన్నికల్లో ఇతను టీడీపీ తరఫున పోటీ చేశాడు.

అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి వ్యక్తి గత కొన్నాళ్లుగా టీడీపీలో అసహనంతో ఉన్నాడు. పార్టీలోకి నల్లారి కిషోర్ ను తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇక్బాల్ అహ్మద్ కు ఏవో హామీలు ఇచ్చాడట. నామినేటెడ్ పదవిని ఇస్తానని కూడా చెప్పాడట. అయితే చంద్రబాబు యథావిధిగా మాట తప్పాడు.

పార్టీలోకి వచ్చిన కిషోర్ కు నామినేటెడ్ పదవి దక్కింది కానీ, ఇక్బాల్ కు దక్కలేదు. దీంతో అసహనభరితుడు అయిన ఇక్బాల్ టీడీపీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ వైసీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజక వర్గంలో వైసీపీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. చింతల రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించాడు. కాబట్టి వైసీపీలో ఇక స్థానం లేదని తెలుసుకుని ఈయన జనసేనలో చేరతాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే జనసేన పెద్దగా పుంజుకోవడం లేదు.

Tags:    
Advertisement

Similar News