సీబీఐపై బ్యాన్ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు
ఏపీలో సీబీఐ అనుమతి లేకుండా అడుగుపెట్టకూడదంటూ చంద్రబాబు విధించిన బ్యాన్‌ను హైకోర్టు సమర్ధించింది. సీబీఐకి సమ్మతి నిరాకరించే అధికారం రాష్ట్రానికి ఉందని అభిప్రాయపడింది. సీబీఐపై బ్యాన్ విధిస్తూ ఏపీ హోంశాఖ జారీ చేసిన జీవో 176 సరైనదేనని వెల్లడించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ జస్టిస్ యాంటీ కరప్షన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, గరీబ్ గైడ్ సంస్థలు వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను కోర్టు తిరస్కరించింది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అంటే అందులో […]
ఏపీలో సీబీఐ అనుమతి లేకుండా అడుగుపెట్టకూడదంటూ చంద్రబాబు విధించిన బ్యాన్‌ను హైకోర్టు సమర్ధించింది. సీబీఐకి సమ్మతి నిరాకరించే అధికారం రాష్ట్రానికి ఉందని అభిప్రాయపడింది. సీబీఐపై బ్యాన్ విధిస్తూ ఏపీ హోంశాఖ జారీ చేసిన జీవో 176 సరైనదేనని వెల్లడించింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ జస్టిస్ యాంటీ కరప్షన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, గరీబ్ గైడ్ సంస్థలు వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను కోర్టు తిరస్కరించింది.
సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అంటే అందులో అంతర్లీనంగా అనుమతి నిరాకరించే అధికారం కూడా ఉన్నట్టేనని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఒక వేళ సీబీఐ దర్యాప్తుకు కోర్టులు ఆదేశిస్తే అప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లుబాటు కాదని చెప్పింది. కోర్టులు ఆదేశించిన పక్షంలో సీబీఐ విచారణలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని కోర్టు వెల్లడించింది.