కూటమిలో ఊపు తెచ్చేలా లగడపాటి ఫోన్లు....
సర్వేల్లో సిద్దహస్తుడిగా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి వ్యవహారశైలి తెలంగాణ ఎన్నికల వేళ వివాదాస్పదమవుతోంది. టీడీపీ కనుసన్నల్లో మహాకూటమిలో ఊపు తెచ్చేందుకు, ప్రజలను డైవర్ట్ చేసేందుకు లగడపాటి పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రతికాధినేతతో కలిసి లగడపాటి తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణ టీఆర్‌ఎస్ నుంచి వస్తోంది. ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పిన లగడపాటి… వారిలో కొందరి పేర్లను వెల్లడించారు. […]
సర్వేల్లో సిద్దహస్తుడిగా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి వ్యవహారశైలి తెలంగాణ ఎన్నికల వేళ వివాదాస్పదమవుతోంది. టీడీపీ కనుసన్నల్లో మహాకూటమిలో ఊపు తెచ్చేందుకు, ప్రజలను డైవర్ట్ చేసేందుకు లగడపాటి పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రతికాధినేతతో కలిసి లగడపాటి తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణ టీఆర్‌ఎస్ నుంచి వస్తోంది.
ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పిన లగడపాటి… వారిలో కొందరి పేర్లను వెల్లడించారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఫోన్లు చేసి వారితో మాట్లాడుతున్నారట.
కాంగ్రెస్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోట ఆ పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి వారిలో మరింత విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్ చేశారని చెబుతున్నారు.
తన సర్వే వివరాలను సత్యంకు వివరించారని…. చిన్న వయసులోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నావ్… ఇది ఎలా సాధ్యమైందని లగడపాటి ఆరా తీశారని టీడీపీ అనుకూల మీడియా కథనం. లగడపాటి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత సత్యం ఉత్సాహంగా ఉన్నారంటూ ఆ పత్రిక కథనాన్ని ప్రసారం చేసింది. ఇలా చేయడం ద్వారా చొప్పదండిలో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్నాయన్న సంకేతాలను ప్రజలకు పంపారు.