డబ్బులు అమరావతిలోనే తీసుకోవాలి " ప్రతికాధినేతలతో మహాకూటమి !
టీడీపీతో పొత్తు తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు మీడియా చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రచారం వస్తోంది. ఇంతకాలం చంద్రబాబు కోసం సైన్యంలా పనిచేసిన మీడియా సంస్థలు ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ కూటమిని గట్టెక్కించేందుకు మెరుపు వేగంతో కథనాలను వండి వారుస్తున్నాయి. పత్రికల్లో, టీవీ చానళ్లలో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడంలో మహాకూటమి కంటే టీఆర్ఎస్ చాలా వెనుకబడిపోయింది. మీడియాను ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలిసిన టీడీపీ తీసుకున్న ముందు జాగ్రత్తలతో పత్రికలు, చానళ్లలో మహాకూటమి ప్రచార హోరు నడుస్తోంది. ప్రముఖ […]
టీడీపీతో పొత్తు తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు మీడియా చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రచారం వస్తోంది. ఇంతకాలం చంద్రబాబు కోసం సైన్యంలా పనిచేసిన మీడియా సంస్థలు ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ కూటమిని గట్టెక్కించేందుకు మెరుపు వేగంతో కథనాలను వండి వారుస్తున్నాయి.
పత్రికల్లో, టీవీ చానళ్లలో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడంలో మహాకూటమి కంటే టీఆర్ఎస్ చాలా వెనుకబడిపోయింది. మీడియాను ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలిసిన టీడీపీ తీసుకున్న ముందు జాగ్రత్తలతో పత్రికలు, చానళ్లలో మహాకూటమి ప్రచార హోరు నడుస్తోంది.
ప్రముఖ ప్రతికల్లో వారాల తరబడి మొదటి పేజీలో ఫుల్‌పేజ్ ప్రకటనలు ఇవ్వడం అంటే కోట్లాది రూపాయల వ్యవహారం. ఇంత డబ్బు కాంగ్రెస్ నేతలైతే ఖర్చు చేసే అవకాశమే లేదు. ఆరా తీయగా ఈ ప్రకటనల వెనుక అసలు రహస్యం బయటకు వస్తోంది.
మహాకూటమి తరపున పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్న కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలకు సొమ్ములు టీడీపీనే చెల్లిస్తోంది. ఒక ప్రముఖ పత్రిక ఎడిటరే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
మహాకూటమి తరపున వస్తున్న ప్రకటనలు మీడియా సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రకటనలకు సంబంధించిన డబ్బును అమరావతిలో తీసుకోవాల్సి ఉంటుందని ప్రతికాధినేతలకు మహాకూటమి నేతలు బహిరంగంగానే చెబుతున్నారని సదరు ప్రముఖ పత్రిక ఎడిటర్ వివరించారు.
మహాకూటమి ప్రతికా ప్రకటనల డబ్బునే అమరావతికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఇక రేపు మహాకూటమి అధికారంలోకి వస్తే ఇక్కడి పాలన అమరావతి నుంచి రిమోట్ ద్వారా ఆపరేట్ చేయకుండా ఉంటారా అని సదరు ఎడిటర్ నిట్టూర్చారు.