నీ ఇంటికి వస్తా.... చొక్కా పట్టుకుని రోడ్డుపైకి లాగుతా....

టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకుని పల్నాడు ప్రాంతంలో యరపతినేని రెచ్చిపోతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో చిన్నచిన్న వ్యాపారుల పొట్టకొట్టి 600 కోట్లు సంపాదించిన వ్యక్తి యరపతినేని అని మండిపడ్డారు. యరపతినేని ఎక్కడికి వెళ్లినా సరస్వతి సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల గురించి మాట్లాడుతున్నారని… తాము ఆ భూములను టీడీపీ నేతల్లాగా దౌర్జన్యంగా లాక్కోలేదన్నారు. రైతులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామన్నారు. రౌడీలను […]

Advertisement
Update:2018-11-30 08:05 IST

టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకుని పల్నాడు ప్రాంతంలో యరపతినేని రెచ్చిపోతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో చిన్నచిన్న వ్యాపారుల పొట్టకొట్టి 600 కోట్లు సంపాదించిన వ్యక్తి యరపతినేని అని మండిపడ్డారు.

యరపతినేని ఎక్కడికి వెళ్లినా సరస్వతి సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల గురించి మాట్లాడుతున్నారని… తాము ఆ భూములను టీడీపీ నేతల్లాగా దౌర్జన్యంగా లాక్కోలేదన్నారు. రైతులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామన్నారు. రౌడీలను వెంటనేసుకుని తమ జోలికి రావాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని యరపతినేనిని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

దౌర్జన్యానికి వస్తే యరపతినేని ఇంటికి వెళ్లి .. చొక్కాపట్టుకుని రోడ్డు మీదకు లాగుతానని పిన్నెల్లి హెచ్చరించారు. తాము కూడా పల్నాడులోనే పుట్టామని… యరపతినేని లాంటి వారికి భయపడే ప్రసక్తే లేదన్నారు. యరపతినేనికి దమ్ముంటే ఒక వైసీపీ కార్యకర్త మీద చేయి వేసి చూడాలని సవాల్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై చేతి వేస్తే యరపతినేని సంగతి తేలుస్తామన్నారు. ఒక దెబ్బకొడితే పది దెబ్బలు కొట్టి తీరుతామన్నారు.

యరపతినేనికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కాసు మహేష్‌ను ఎదుర్కోవాలని చాలెంజ్ చేశారు. వెన్నుపోటుకు, అబద్దాలకు మారుపేరైన చంద్రబాబులాంటి వ్యక్తి వద్ద పనిచేస్తున్న యరపతినేనికే అంతుంటే… తమకెంతుండాలని పిన్నెల్లి ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News