తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రా ఆక్టోపస్‌గా భావించే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం లేదన్నారు. ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనవడం లేదన్నారు. చాలా చోట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ప్రజలు ఓట్లేయబోతున్నారని చెప్పారు. 8 నుంచి 10 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులే విజయం సాధించబోతున్నారన్నారు. నారాయణపేట్‌, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు గెలవబోతున్నారని లగడపాటి జోస్యం చెప్పారు. ఇండిపెండెంట్‌గా గెలిచే అభ్యర్థుల పేర్లను […]

Advertisement
Update:2018-11-30 08:10 IST

ఆంధ్రా ఆక్టోపస్‌గా భావించే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం లేదన్నారు.

ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లోనవడం లేదన్నారు. చాలా చోట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ప్రజలు ఓట్లేయబోతున్నారని చెప్పారు. 8 నుంచి 10 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులే విజయం సాధించబోతున్నారన్నారు.

నారాయణపేట్‌, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు గెలవబోతున్నారని లగడపాటి జోస్యం చెప్పారు. ఇండిపెండెంట్‌గా గెలిచే అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున ప్రకటిస్తానని లగడపాటి వెల్లడించారు. పూర్తి వివరాలను డిసెంబర్ 7 తర్వాత వివరిస్తానని చెప్పారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌ నియోజవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి గెలవబోతున్నారని లగడపాటి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ నియోజక వర్గం నుంచి అనిల్ జాదవ్‌ గెలుస్తారని వెల్లడించారు.

పలు స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఈ వైఖరిని తాను కూడా ఊహించలేదన్నారు. ప్రలోభాలకు, పార్టీల బలాలకు లొంగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపు ప్రజలు నిలవడం ఆశ్చర్యం కలిగించిందని… ఇది స్వాగతించాల్సిన పరిణామమన్నారు.

రాజకీయ పార్టీల ఫలితాల గురించి ఇప్పుడు చెప్పడం సరికాదన్నారు. తాను కూడా రెబలే కాబట్టే రెబల్ అభ్యర్థుల గెలుపు గురించి చెబుతున్నానని లగడపాటి వివరించారు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడితే తాను కూడా వివాదాస్పదం అవుతానని అందుకే పార్టీల గురించి చెప్పడం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News