సుప్రీంతో సంబంధం లేకుండా ఫిరాయింపుదారుల కేసు విచారణ " హైకోర్టు

ఏపీలో ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే నోటీసులు జారీ చేసినా ఒక్క ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఫిరాయింపుదారుల వ్యవహారంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో నడుస్తున్న కేసుతో సంబంధం లేకుండా ఏపీలో జరిగిన ఫిరాయింపుల అంశాన్ని తామే స్వయంగా తేలుస్తామని హైకోర్టు వెల్లడించింది. ఫిరాయింపుదారులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అసెంబ్లీలో తన […]

Advertisement
Update:2018-11-30 04:40 IST

ఏపీలో ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే నోటీసులు జారీ చేసినా ఒక్క ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.

ఫిరాయింపుదారుల వ్యవహారంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో నడుస్తున్న కేసుతో సంబంధం లేకుండా ఏపీలో జరిగిన ఫిరాయింపుల అంశాన్ని తామే స్వయంగా తేలుస్తామని హైకోర్టు వెల్లడించింది. ఫిరాయింపుదారులకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అసెంబ్లీలో తన కళ్లముందే కూర్చుంటున్నా చర్యలు తీసుకోవడం లేదని స్పీకర్‌ పైనా తీవ్ర విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కోర్టు ఫిరాయింపు దారులతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకూ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఏ అధికారంతో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలంటూ ఎందుకు ఆదేశాలు జారీ చేయరాదో చెప్పాలని కూడా చీఫ్‌ జస్టిస్ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.

తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేశారు. గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా అందుకు కౌంటర్ కూడా దాఖలు చేయని ఫిరాయింపుదారులు ఈసారైనా కోర్టు నోటీసులకు స్పందిస్తారో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News