బినామీల కోసం రాహుల్ పంచన బాబు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ట్విట్టర్ లో మరోసారి స్పందించారు. బుధవారం మధ్యాహ్నం ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో బాబుపై బాణాల్లాంటి విమర్శలను సంధించారు.. రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి వస్తుండడంతో దీనికి చంద్రబాబు కూడా హాజరు కానుండడంతో సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. బద్ధ శత్రువులుగా, దశాబ్ధాలుగా మెలిగిన ఈ నేతలు ఇటీవలే కలిసిపోయిన సంగతి తెలిసిందే…. తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-టీడీపీ కలిసి పోయి కూటమిగా ఏర్పాడ్డాయి. కూటమి అభ్యర్థుల […]

Advertisement
Update:2018-11-28 07:28 IST

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ట్విట్టర్ లో మరోసారి స్పందించారు. బుధవారం మధ్యాహ్నం ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో బాబుపై బాణాల్లాంటి విమర్శలను సంధించారు.. రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి వస్తుండడంతో దీనికి చంద్రబాబు కూడా హాజరు కానుండడంతో సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

బద్ధ శత్రువులుగా, దశాబ్ధాలుగా మెలిగిన ఈ నేతలు ఇటీవలే కలిసిపోయిన సంగతి తెలిసిందే…. తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-టీడీపీ కలిసి పోయి కూటమిగా ఏర్పాడ్డాయి. కూటమి అభ్యర్థుల కోస ప్రచారం చేసేందుకు తాజాగా రాహుల్-బాబు డిసైడ్ అయ్యారు.

కాంగ్రెస్, టీడీపీ అనైతిక పొత్తు, ప్రచారంపై జీవీఎల్ ట్విట్టర్ లో సూటి ప్రశ్నలు సంధించారు. ‘తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నాడు ఎన్టీఆర్ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. కానీ నేడు చంద్రబాబు తన ఆర్థిక సహచరులు సీఎం రమేష్, సుజనా చౌదరిలు చేసిన మోసం పై నమోదైన ఐటీ, ఈడీ కేసుల నుంచి తప్పించేదుకు రాహుల్ పంచన చేరారు. ఇది స్వార్థపూరితమైన యూనైటెడ్ లూటర్స్ కూటమి (యూఎల్ఏ) . దీన్ని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు’ అంటూ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు.

దానికి గంట ముందు మరో ట్వీట్ లో కూడా జీవీఎల్ చంద్రబాబు తీరును విమర్శించారు… ‘ఊరందరిదీ ఒక దోవ అయితే.. ఉలిపి కట్టెది ఒక దోవ అనేలా ఉంది చంద్రబాబు తీరు’ అని విమర్శించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం దేశం అంతా కోరుకుంటుంటే…. ఆంధ్రాకు అన్యాయం చేసిన కాంగ్రెస్ చెంతన చేరిన తెలుగుదేశం చేస్తున్నది నయవంచన అని జీవిఎల్ విమర్శించారు. అంతేకాదు.. దారినపోయే శనీశ్వరుణ్ణి (రాహుల్) పిలిచి పీట వేస్తున్న టీడీపీకి దారుణ ఓటమి తప్పదని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News