చరిత్రలో నిలిచే ఘట్టం... కాంగ్రెస్ కండువా వేసుకున్న చంద్రబాబు
రాహుల్ గాంధీ, తాను కలిసి పాల్గొన్న బహిరంగ సభలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగానే…. చరిత్రలో నిలిచిపోయే సన్నివేశాలు అక్కడ చోటు చేసుకున్నాయి. సనత్‌నగర్ బహిరంగ సభలో రాహుల్‌తో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ సాగించిన 37 ఏళ్ల పోరాటానికి ముగింపు అన్నట్టుగా కాంగ్రెస్ కండువాను చంద్రబాబు కప్పుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే గంగాభవాని అనే కాంగ్రెస్ నాయకురాలు వేదిక మీద చంద్రబాబు మెడలో కాంగ్రెస్ కండువా కప్పారు. చంద్రబాబు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా […]
రాహుల్ గాంధీ, తాను కలిసి పాల్గొన్న బహిరంగ సభలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగానే…. చరిత్రలో నిలిచిపోయే సన్నివేశాలు అక్కడ చోటు చేసుకున్నాయి.
సనత్‌నగర్ బహిరంగ సభలో రాహుల్‌తో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ సాగించిన 37 ఏళ్ల పోరాటానికి ముగింపు అన్నట్టుగా కాంగ్రెస్ కండువాను చంద్రబాబు కప్పుకున్నారు.
రాహుల్ గాంధీ సమక్షంలోనే గంగాభవాని అనే కాంగ్రెస్ నాయకురాలు వేదిక మీద చంద్రబాబు మెడలో కాంగ్రెస్ కండువా కప్పారు. చంద్రబాబు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా దర్జాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో మామపైనే పోటీ చేస్తానని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే వెంటనే టీడీపీలో చేరారు. ఆ తర్వాత దశాబ్దాల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.