బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.... చేతిలో ఒక్క సినిమా లేదు....

డైరెక్టర్ పరశురాం…..”గీత గోవిందం” రిలీజ్ కి ముందు ఈ పేరు కేవలం ఇండస్ట్రీ వర్గాలకి మాత్రమే పరిమితం. కానీ “గీత గోవిందం” సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టాక ఈ డైరెక్టర్ పేరు అందరికీ పరిచయం అయ్యింది. పరశురాం గతంలో “యువత” “సోలో” “శ్రీరస్తు శుభమస్తు” వంటి సినిమాలని డైరెక్ట్ చేశాడు. పరశురాం డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకున్నా కూడా మంచి సినిమాలుగా నిలిచాయి. అయితే “గీత గోవిందం” వంటి […]

Advertisement
Update:2018-11-27 07:12 IST

డైరెక్టర్ పరశురాం…..”గీత గోవిందం” రిలీజ్ కి ముందు ఈ పేరు కేవలం ఇండస్ట్రీ వర్గాలకి మాత్రమే పరిమితం. కానీ “గీత గోవిందం” సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టాక ఈ డైరెక్టర్ పేరు అందరికీ పరిచయం అయ్యింది.

పరశురాం గతంలో “యువత” “సోలో” “శ్రీరస్తు శుభమస్తు” వంటి సినిమాలని డైరెక్ట్ చేశాడు. పరశురాం డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకున్నా కూడా మంచి సినిమాలుగా నిలిచాయి.

అయితే “గీత గోవిందం” వంటి బ్లాక్ బస్టర్ తరువాత కూడా ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ ఇంకా తన తదుపరి సినిమా స్టార్ట్ చెయ్యలేదు. చేతిలో బాగానే కథలు ఉన్నా…. డేట్స్ ఇచ్చే హీరో మాత్రం కరువయ్యాడు.

ఎందుకంటే “గీత గోవిందం” అనేది విజయ్ దేవరకొండ వల్ల హిట్ అయ్యింది…. అందులో పరశురాం చేసింది ఏమి లేదు…. అని చాలా మంది భావన. కానీ ఈ భావన అందరిలో నుంచి తొలిగిపోవాలి అంటే పరశురాం వెంటనే ఒక హీరోని పట్టుకొని సినిమా తీసి మంచి హిట్ ని కొట్టాలి. కానీ పరశురాం కి ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా దొరకలేదు. మరి పరశురాంకి ఏ హీరో డేట్స్ ఇస్తాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News