క్షమాపణలు చెబితే సరిపోతుందా ?

థగ్స్ ఆప్ హిందూస్థాన్ ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. దీన్ని ఫ్లాప్ అనేకంటే డిజాస్టర్ అనడం కరెక్ట్. కొంతమంది విశ్లేషకులైతే డిజాస్టర్ అనే పదం కూడా చిన్నదంటారు. అంత ఫ్లాప్ అయింది ఈ సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంపై హీరో అమీర్ ఖాన్ విచారం వ్యక్తంచేశాడు. తన సినిమా ఫ్లాప్ అయినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఫ్లాప్ అయినందుకు సారీ చెప్పి మరోసారి మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు అమీర్. […]

Advertisement
Update:2018-11-27 16:18 IST

థగ్స్ ఆప్ హిందూస్థాన్ ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. దీన్ని ఫ్లాప్ అనేకంటే డిజాస్టర్ అనడం కరెక్ట్. కొంతమంది విశ్లేషకులైతే డిజాస్టర్ అనే పదం కూడా చిన్నదంటారు. అంత ఫ్లాప్ అయింది ఈ సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంపై హీరో అమీర్ ఖాన్ విచారం వ్యక్తంచేశాడు. తన సినిమా ఫ్లాప్ అయినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు.

ఫ్లాప్ అయినందుకు సారీ చెప్పి మరోసారి మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు అమీర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ, సారీ చెబితే అయిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు ఎగ్జిబిటర్లు. దాదాపు 300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి బయ్యర్ కు 50శాతానికి పైగా నష్టాలు తెచ్చింది.

తమను ఆదుకోవాలని, నిర్మాతలతో మాట్లాడి కొంత మొత్తమైనా వెనక్కు ఇప్పించాలని ఎగ్జిబిటర్లు కొన్ని రోజులుగా అమీర్ పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కానీ ఈ హీరో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకుండా, ఫ్లాప్ అయినందుకు క్షమాపణలు మాత్రం చెప్పి ఊరుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News