ఈ నాయకుల మీద.... ఇన్ని చలానాలా?

మొన్నీ మధ్య ఒక పోలీసు అధికారి వాహనానికి…. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు ఫైన్‌ వేస్తే పెద్ద వార్త అయింది. అంతకు ముందు ఒకే వాహనం మీద ఇరవయ్యే, ముప్పయ్యే చలానాలు పెండింగ్‌ లో ఉంటే…. ఆ వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుని చలానాలు కట్టించి వదిలితే పెద్ద వార్త అయింది. ఇలాంటి వార్తలను మించిపోయే మరో వార్త ఏమిటంటే…. ఎన్నికల సందర్భంగా పోటీలో ఉండే నాయకుల వాహనాల పెండింగ్‌ చలానాల గురించి బయటకు వచ్చిన సమాచారం ఆశ్చర్యం […]

Advertisement
Update:2018-11-25 09:32 IST

మొన్నీ మధ్య ఒక పోలీసు అధికారి వాహనానికి…. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు ఫైన్‌ వేస్తే పెద్ద వార్త అయింది. అంతకు ముందు ఒకే వాహనం మీద ఇరవయ్యే, ముప్పయ్యే చలానాలు పెండింగ్‌ లో ఉంటే…. ఆ వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుని చలానాలు కట్టించి వదిలితే పెద్ద వార్త అయింది.

ఇలాంటి వార్తలను మించిపోయే మరో వార్త ఏమిటంటే…. ఎన్నికల సందర్భంగా పోటీలో ఉండే నాయకుల వాహనాల పెండింగ్‌ చలానాల గురించి బయటకు వచ్చిన సమాచారం ఆశ్చర్యం గొల్పుతోంది.

అందరికన్నా ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకురాలు డికే అరుణ వాహనం పై ఎక్కువ చలానాలు ఉన్నాయి. రూ. 15,785 ఫైన్‌ కట్టాల్సి ఉంది ఆమె. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేరుతో 7, 445 రూపాయల పెండింగ్‌ చలానాలున్నాయి. రేవంత్‌ రెడ్డి పేరుతో 2,505 రూపాయల పెండింగ్‌ చలానాలున్నాయి.

అలాగే రాజాసింగ్ పేరుతో 1,035 రూపాయల పెండింగ్‌ చలానాలున్నాయి. అలాగే దానం నాగేందర్‌ పేరుతో 2,140 రూపాయల పెండింగ్‌ చలానాలున్నాయి. టీఆర్‌ఎస్‌ జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ భార్య పేరుతో 3,220 రూపాయల పెండింగ్‌ చలానాలున్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌ చాంతాడంత అవుతుంది.

ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల అభ్యర్ధులు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద సుమారు ఏడు, ఎనిమిది ఏళ్ళ నుంచి పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉండడం విశేషం. చట్టాలు చేసేది వీళ్ళే…. అతిక్రమించేదీ వీళ్ళే…. ఫైన్‌లు కట్టడంలో మాత్రం వెనక ఉండేది వీళ్ళే.

Tags:    
Advertisement

Similar News