నీరవ్ రూ. 11000 కోట్లు, మాల్యా రూ.9000 కోట్లు.... మూడో స్థానంలో సుజనాచౌదరే
దేశంలో దొంగలుపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాతి పరిణామాలతో కేంద్రం లక్షలాది షెల్ కంపెనీలను దేశవ్యాప్తంగా గుర్తించింది. దాంతో వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుని విచ్చలవిడిగా వ్యవహరించిన బడాబాబుల పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో బ్యాంకులను వేల కోట్లలో ముంచిన వ్యక్తులుగా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ప్రపంచానికి బాగా పరిచయం అయ్యారు. వీరిని మించి బ్యాంకులను ముంచిన వారు ఉన్నా ఇంకా వారి వ్యవహారాలు బయటకు రావడంలేదు. ఇప్పటి వరకు నీరవ్ మోడీ పంజాబ్ […]
దేశంలో దొంగలుపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాతి పరిణామాలతో కేంద్రం లక్షలాది షెల్ కంపెనీలను దేశవ్యాప్తంగా గుర్తించింది. దాంతో వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుని విచ్చలవిడిగా వ్యవహరించిన బడాబాబుల పునాదులు కదిలిపోతున్నాయి.
ఇప్పటికే దేశంలో బ్యాంకులను వేల కోట్లలో ముంచిన వ్యక్తులుగా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ప్రపంచానికి బాగా పరిచయం అయ్యారు. వీరిని మించి బ్యాంకులను ముంచిన వారు ఉన్నా ఇంకా వారి వ్యవహారాలు బయటకు రావడంలేదు. ఇప్పటి వరకు నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును 11వేల కోట్ల రూపాయల మేర ముంచేసి విదేశాలకు పారిపోయారు.
అంతకంటే ముందే విలాసపురుష్ విజయ్ మాల్యా పలు బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగవేసి దేశం విడిచి చక్కేశారు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కుంభకోణాల్లో నీరవ్, మాల్యా తర్వాత బ్యాంకులను ముంచిన అతిపెద్ద కుంభకోణం టీడీపీ ఎంపీ సుజనా చౌదరిదే. సుజనా చౌదరి బ్యాంకుల నుంచి 6,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. వాటి తాలూకూ వడ్డీ ఎంతో ఇంకా తేల లేదు. ఆ విషయాలు కూడా బయటకు వస్తే సుజనా చౌదరి విజయ్ మాల్యాను దాటి రెండో స్థానం ఆక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
విజయ్ మల్యా, నీవర్ మోడీకి సంబంధించిన కంపెనీల ఆస్తులైనా జప్తు చేయడానికి మిగిలాయి. కానీ ఆరు వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న సుజనాచౌదరి కంపెనీలకు సంబంధించి ఆస్తులు కూడా పెద్దగా లేవు. వాటిని వేలం వేసినా రుణంలో ఐదు శాతం కూడా రికవరీ అయ్యే అవకాశం లేదని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ డబ్బంతా ఎక్కడికి మళ్లించారు… ఏం చేశారు?… అన్నది జరిగే దర్యాప్తును బట్టి తేలే అవకాశం ఉంటుందంటున్నారు.