చిరు చిన్నల్లుడు రెండో సినిమా
బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోగా మారిపోవడం చాలా ఈజీ. కానీ హీరోగా నిలదొక్కుకోవాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు. అంతకుమించి టాలెంట్ కావాలి. మనదైన ఓ స్టయిల్ ఉండాలి. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ లో అవే లోపించాయి. అందుకే మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోగా మారిపోయాడు. టైటిల్ లో విజేత ఉంది కానీ, ఇండస్ట్రీలో విజేతగా నిలవలేకపోయాడు. ఇలా విజేత తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు తన సెకెండ్ వెంచర్ […]
బ్యాక్ గ్రౌండ్ ఉంటే హీరోగా మారిపోవడం చాలా ఈజీ. కానీ హీరోగా నిలదొక్కుకోవాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు. అంతకుమించి టాలెంట్ కావాలి. మనదైన ఓ స్టయిల్ ఉండాలి. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ లో అవే లోపించాయి. అందుకే మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోగా మారిపోయాడు. టైటిల్ లో విజేత ఉంది కానీ, ఇండస్ట్రీలో విజేతగా నిలవలేకపోయాడు.
ఇలా విజేత తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు తన సెకెండ్ వెంచర్ కు రెడీ అవుతున్నాడు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కల్యాణ్ దేవ్. పులివాసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు.
నిజానికి కల్యాణ్ దేవ్ తలుచుకుంటే పెద్ద డైరక్టర్లు కాకపోయినా, ఓ మోస్తరు డైరక్టర్లను లైన్లో పెట్టగలడు. చిరంజీవి అడిగితే ఎవరు కాదంటారు చెప్పండి. మొదటి సినిమాకు చిరంజీవే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. కానీ రెండో సినిమా నుంచి పూర్తిగా కల్యాణ్ దేవ్ కే పగ్గాలు అప్పగించాడు. అలా చిరు ప్రమేయం లేకుండా సెకెండ్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు కల్యాణ్ దేవ్.