పటేల్ విగ్రహం కన్నా.... ఎత్తైన అసెంబ్లీని నిర్మిస్తాడట....
మోడీ దేశానికి ప్రధాని.. చంద్రబాబు ఏపీ రాజ్యానికి ముఖ్యమంత్రి .. కానీ మోడీకంటే ఏ విషయంలో తాను తక్కువ కాదని బాబు నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే.. మోడీ దేశంలోనే అతి ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరిస్తే మోడీ అంటేనే పడని చంద్రబాబు ఊరుకుంటారా.? ఇప్పుడు ఏకంగా మోడీకి షాకిచ్చేలా దేశంలోనే అతిఎత్తైన అసెంబ్లీ భవన నిర్మాణానికి పూనుకున్నారు. దీని ద్వారా మోడీని తలదన్నేలా ఎత్తైన భవన […]
మోడీ దేశానికి ప్రధాని.. చంద్రబాబు ఏపీ రాజ్యానికి ముఖ్యమంత్రి .. కానీ మోడీకంటే ఏ విషయంలో తాను తక్కువ కాదని బాబు నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే.. మోడీ దేశంలోనే అతి ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరిస్తే మోడీ అంటేనే పడని చంద్రబాబు ఊరుకుంటారా.? ఇప్పుడు ఏకంగా మోడీకి షాకిచ్చేలా దేశంలోనే అతిఎత్తైన అసెంబ్లీ భవన నిర్మాణానికి పూనుకున్నారు. దీని ద్వారా మోడీని తలదన్నేలా ఎత్తైన భవన నిర్మాణం ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నారు.
సీబీఐ, ఐటీ దాడులతో ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టిన మోడీకి ఇటీవల బాబు షాక్ ఇచ్చారు. సీబీఐని ఏపీలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే కోవలో మోడీ ఆవిష్కరించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పోటీగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో ఆంధ్రా నూతన అసెంబ్లీని దేశంలోనే ఎత్తైనదిగా నిర్మించడానికి డిజైన్లు ఓకే చేశారు. దీని ఎత్తు స్టాట్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్లకంటే 68 మీటర్లు ఎక్కువ.
చంద్రబాబు తాజాగా అమరావతి అసెంబ్లీ, సెక్రేటేరియట్ కు ఆమోద ముద్ర వేశారు. కొన్ని మైనర్ మార్పులు చేసి బ్లూ ప్రింట్ను విడుదల చేశారు. యూకే కు చెందిన నార్మా ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్ ను రూపొందించింది. ఈ ఏపీ నూతన అసెంబ్లీలో మూడ ఫ్లోర్లతోపాటు మధ్యలోంచి 250 మీటర్ల టవర్ ను ఆకాశహర్మంగా నిర్మిస్తారు.
దేశంలో ఇప్పుడు ఈ భారీ ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి ఆయా రాష్ట్రాల సీఎంలు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అయోధ్యలో 201 మీటర్ల ఎత్తుతో రామమందిర నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా స్టాట్యూఆఫ్ మదర్ కు శ్రీకారం చుట్టింది. దీని ఎత్తు 125 అడుగులు.
తాజాగా ఏపీ అసెంబ్లీ నిర్మాణ డిజైన్లు పూర్తి కావడంతో వీటి నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ అసెంబ్లీ నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. ఈ అసెంబ్లీ వెనకాల 5 ఎత్తైన భవనాలతో సెక్రెటేరియట్ ను కూడా చంద్రబాబు ప్రతిపాదించారు. దీన్ని ఏపీ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథార్టీ అధికారులు డ్రాఫ్ట్ టెండర్ ద్వారా నిర్మించడానికి నోటిఫికేషన్ వేయనున్నారు.