టికెట్ ఎగ్గొట్టి... బండ్ల గణేష్‌కు కొత్త పదవి
పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయిపోయినట్టే హంగామా చేసిన నిర్మాత బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే అయిపోదామనుకున్న గణేష్‌కు టికెట్ మాత్రం ఇవ్వలేదు. షాద్‌నగర్ టికెట్ ఆశించగా మరొకరికి కట్టబెట్టారు. దీంతో ఎమ్మెల్యే అవుతానంటూ టీవీ స్టూడియోల్లో ప్రమాణస్వీకారం చేసినంత పని చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు నవ్వుల పాలైపోయారు. ఆయన్ను ఒక కమెడియన్‌గా చూసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దీంతో బండ్ల గణేష్ ఆవేదనతో ఉన్నారు. ఆ వేదనను గుర్తించిన కాంగ్రెస్… అధికార […]
పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే అయిపోయినట్టే హంగామా చేసిన నిర్మాత బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే అయిపోదామనుకున్న గణేష్‌కు టికెట్ మాత్రం ఇవ్వలేదు. షాద్‌నగర్ టికెట్ ఆశించగా మరొకరికి కట్టబెట్టారు. దీంతో ఎమ్మెల్యే అవుతానంటూ టీవీ స్టూడియోల్లో ప్రమాణస్వీకారం చేసినంత పని చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు నవ్వుల పాలైపోయారు.
ఆయన్ను ఒక కమెడియన్‌గా చూసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దీంతో బండ్ల గణేష్ ఆవేదనతో ఉన్నారు. ఆ వేదనను గుర్తించిన కాంగ్రెస్… అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పవన్ కల్యాణ్‌కు భక్తుడైన బండ్ల గణేష్ ఆ బంధాన్ని కూడా వదిలేసి ఎమ్మెల్యే అయ్యేందుకు టీ కాంగ్రెస్‌లో చేరారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం నుంచే మీడియాలో ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టారు బండ్ల. ఒక టీవీ చానల్‌కు వెళ్లి ఇంటర్వ్యూ మధ్యలో బండ్ల గణేష్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం చేసినంత పని చేశారు.
వాస్తవాలకు దూరంగా కొన్ని చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని చూసిన జనం నవ్వుకున్నారు. ఈ వ్యవహారాలను కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు చేరవేసి… బండ్ల గణేష్‌కు టికెట్ ఇస్తే పార్టీ పరువు పోతుందని హెచ్చరించారు. దీంతో బండ్ల గణేష్ సీన్ రివర్స్ అయినట్టు భావిస్తున్నారు.