ఇద్దరూ తన్నుకొని అంగీకారానికొచ్చారు

మొన్నటికిమొన్న నాగచైతన్య సినిమాల విషయంలో ఏం జరిగిందో చూశాం. అతడు నటించిన శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ఒకేసారి రెడీ అయ్యాయి. దీంతో నిర్మాతలు ముందుగా తమ సినిమానే విడుదల చేయాలని పోటీపడ్డారు. ఫలితంగా ఓ ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో గిల్లికజ్జా తెరపైకి వచ్చింది. ఇది కూడా దాదాపు 10 రోజుల కిందటే మొదలైంది. ఇది సుమంత్ కు సంబంధించిన మేటర్ సుమంత్ నటించిన ఇదం జగత్, సుబ్రమణ్యపురం సినిమాలు రెండూ […]

Advertisement
Update:2018-11-17 04:34 IST

మొన్నటికిమొన్న నాగచైతన్య సినిమాల విషయంలో ఏం జరిగిందో చూశాం. అతడు నటించిన శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ఒకేసారి రెడీ అయ్యాయి. దీంతో నిర్మాతలు ముందుగా తమ సినిమానే విడుదల చేయాలని పోటీపడ్డారు. ఫలితంగా ఓ ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో గిల్లికజ్జా తెరపైకి వచ్చింది. ఇది కూడా దాదాపు 10 రోజుల కిందటే మొదలైంది. ఇది సుమంత్ కు సంబంధించిన మేటర్

సుమంత్ నటించిన ఇదం జగత్, సుబ్రమణ్యపురం సినిమాలు రెండూ ఒకేసారి రెడీ అయ్యాయి. వీటిలో ఏ సినిమాను ముందు విడుదల చేయాలో అర్థంకాలేదు. మరోవైపు నిర్మాతలు మాత్రం తమ సినిమానే ముందు రావాలంటూ పోటీలుపడి మరీ పోస్టర్లు రిలీజ్ చేశారు. తెరవెనక ఎన్నో పంచాయితీలు నడిచాయి. ఫైనల్ గా ముందుగా బరిలో దిగే ఛాన్స్ ఇదం జగత్ సినిమాకు దక్కింది.

సుమంత్, అంజు కురియన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అనీల్ శ్రీకంఠం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. రచ్చకెక్కి పరువు పోగొట్టుకున్న తర్వాత ఇలా రెండు సినిమాల నిర్మాతలు కలిసిపోవడంతో టాలీవుడ్ లో అంతా నవ్వుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News