కొరియోగ్రాఫర్ గా మారిన శ్రీనువైట్ల

దర్శకుడు అనేవాడు డైరక్షన్ మాత్రమే చేయాలి. కానీ కొందరు దర్శకులకు ఓ రకమైన పిచ్చి ఉంటుంది. దర్శకత్వంతో పాటు మిగతా విభాగాల్లో కూడా వేలు పెట్టాలి, ఏదేదో కెలికాయాలనే చిలిపి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శ్రీనువైట్ల కూడా దీనికి అతీతుడు కాదు. ఇప్పటికే డైలాగ్స్, స్క్రీన్ ప్లే లో వేలు పెట్టి కోనవెంకట్ ను దూరంచేసుకున్న ఈ దర్శకుడు.. తాజాగా కొరియోగ్రఫీ కూడా చేశాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు శ్రీనువైట్ల కేవలం దర్శకుడు మాత్రమే కాదు. […]

Advertisement
Update:2018-11-16 05:02 IST

దర్శకుడు అనేవాడు డైరక్షన్ మాత్రమే చేయాలి. కానీ కొందరు దర్శకులకు ఓ రకమైన పిచ్చి ఉంటుంది. దర్శకత్వంతో పాటు మిగతా విభాగాల్లో కూడా వేలు పెట్టాలి, ఏదేదో కెలికాయాలనే చిలిపి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శ్రీనువైట్ల కూడా దీనికి అతీతుడు కాదు. ఇప్పటికే డైలాగ్స్, స్క్రీన్ ప్లే లో వేలు పెట్టి కోనవెంకట్ ను దూరంచేసుకున్న ఈ దర్శకుడు.. తాజాగా కొరియోగ్రఫీ కూడా చేశాడు.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు శ్రీనువైట్ల కేవలం దర్శకుడు మాత్రమే కాదు. నృత్య దర్శకుడు కూడా. అవును.. ఈ సినిమాలో 2 పాటలకు పూర్తిగా శ్రీనువైట్ల కొరియోగ్రఫీ అందించాడు. ఇక్కడితో ఆగలేదు ఈ దర్శకుడు. సినిమాలో ఓ ఫైట్ ను కూడా తనే కంపోజ్ చేశాడు. ఈ విషయాలన్నింటినీ తాజా ఇంటర్వ్యూలో తనే బయటపెట్టాడు.

ఇలా చేయడం వల్ల ఓ దర్శకుడికి మరింత స్వేచ్ఛ లభిస్తుందని అంటున్నాడు వైట్ల. ఓ దర్శకుడికి మూవీ మేకింగ్ లో అన్ని విభాగాలపై పట్టు ఉండాలని అనడం కరెక్ట్. కానీ అన్ని విభాగాల్లో తను కూడా పనిచేయాలని కోరుకోవడం అవివేకం. ఈ చిన్న లాజిక్ ను శ్రీనువైట్ల మిస్ అయినట్టున్నాడు.

Tags:    
Advertisement

Similar News