రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ

అమర్ అక్బర్ ఆంటోనీ విడుదలైన వెంటనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. తమిళ్ లో హిట్ అయిన తేరి సినిమా ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు. అయితే రవితేజ మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు. “తేరి సినిమాకు రీమేక్ గా మా కొత్త సినిమా రావడం లేదు. విజయ్ నటించిన తేరి సినిమాను మేం రీమేక్ చేస్తున్నామనే వార్తల్లో నిజం లేదు. ఇది […]

Advertisement
Update:2018-11-15 02:55 IST

అమర్ అక్బర్ ఆంటోనీ విడుదలైన వెంటనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. తమిళ్ లో హిట్ అయిన తేరి సినిమా ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు. అయితే రవితేజ మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు.

“తేరి సినిమాకు రీమేక్ గా మా కొత్త సినిమా రావడం లేదు. విజయ్ నటించిన తేరి సినిమాను మేం రీమేక్ చేస్తున్నామనే వార్తల్లో నిజం లేదు. ఇది పూర్తిగా కొత్త లైన్. అమర్ అక్బర్ ఆంటోనీ విడుదలైన వెంటనే కొత్త సినిమా సంగతులు చెబుతాను.” ఇలా తన కొత్త సినిమాపై ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు రవితేజ.

అయితే ఇక్కడే మేకర్స్ ఓ ఎత్తుగడను అమలుచేసినట్టు తెలుస్తోంది. తేరి సినిమాకు రీమేక్ అని చెబితే, రీమేక్ రైట్స్ కింద భారీ మొత్తం సమర్పించుకోవాలి. అలా చెప్పకుండా తేరి సినిమా నుంచి స్పూర్తి పొంది సినిమా తీస్తే రీమేక్ రైట్స్ కింద డబ్బు చెల్లించక్కర్లేదు కదా. ప్రస్తుతం అదే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదే కనుక నిజమైతే.. రిలీజ్ టైమ్ లో రవితేజ-సంతోష్ శ్రీనివాస్ కు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఒక సినిమా ఏ భాషలో ఎలా తెరకెక్కినా, అందులో కంటెంట్ తమ సినిమాకు దగ్గరగా ఉందని తెలిస్తే అది పెద్ద కేసు అయిపోతోంది. మొన్నటికిమొన్న విజయ్ నటించిన సర్కార్ విషయంలో కూడా అదే జరిగింది. మరి ఈ సెన్సిటివ్ ఇష్యూను రవితేజ ఎలా డీల్ చేస్తాడో చూడాలి

Tags:    
Advertisement

Similar News