ఆ ఎంపీ సీటు విషయంలో జగన్ వ్యూహం రైటేనా?
రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడ బీసీ అభ్యర్థిని తెర మీదకు తీసుకు వచ్చాడు జగన్. రాజమండ్రి ఎంపీ సీటును బీసీలకు కేటాయిస్తానని తను గతంలో హామీ ఇచ్చాను అని…. ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నాను అని.. ఈ సీటును బీసీ నేతకే కేటాయిస్తున్నట్టుగా జగన్ ప్రకటించాడు. పార్టీలో చేరిన మార్గాని నాగేశ్వరరావుకు కానీ ఆయన తనయుడు భరత్ రామ్ […]
రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడ బీసీ అభ్యర్థిని తెర మీదకు తీసుకు వచ్చాడు జగన్. రాజమండ్రి ఎంపీ సీటును బీసీలకు కేటాయిస్తానని తను గతంలో హామీ ఇచ్చాను అని…. ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నాను అని.. ఈ సీటును బీసీ నేతకే కేటాయిస్తున్నట్టుగా జగన్ ప్రకటించాడు.
పార్టీలో చేరిన మార్గాని నాగేశ్వరరావుకు కానీ ఆయన తనయుడు భరత్ రామ్ కు కానీ రాజమండ్రి ఎంపీ టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది. మార్గాని నాగేశ్వరరావు ఒక వ్యాపారవేత్త. అంతే కాదు.. బీసీ సంఘాల జేఏసీకి అధినేతగా ఉన్నారు. బీసీ సంఘాల కార్యకలాపాల్లో పాలు పంచుకొంటూ ఉంటాడు. ఆయన గౌడ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.
రాజమండ్రి ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే పలు అసెంబ్లీ సీట్ల పరిధిలో ఈ సామాజికవర్గం జనాభా గణనీయంగా ఉంది.
గత ఎన్నికల్లో ఈ సీటును తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. అయితే ఈ సారి మాత్రం టీడీపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే బీసీ కి ఈ సీటును కేటాయించడం ఒకింత ప్రయోగాత్మకమే అనే అబిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక మార్గాని తనయుడు కొంత కాలం కిందట వరకూ తెలుగుదేశం పార్టీలో పని చేశాడు. ఆయనకు రాజమండ్రి రూరల్ సీటును ఇస్తామని లోకేష్ ఆఫర్ చేశాడట. అయినా దానికి కాదని…. వీళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.