బండ్లకు షాక్.... పొన్నాలపై సైలెంట్
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 11 మందితో జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. పొత్తులో భాగంగా పోగా ఇంకో 19 స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలోనూ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపేరు లేదు. సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి మాత్రం సీటు దక్కింది. ఆయనకు భూపాలపల్లి టికెట్ కేటాయించారు. షాద్ నగర్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో […]
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 11 మందితో జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. పొత్తులో భాగంగా పోగా ఇంకో 19 స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
రెండో జాబితాలోనూ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపేరు లేదు. సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి మాత్రం సీటు దక్కింది. ఆయనకు భూపాలపల్లి టికెట్ కేటాయించారు.
షాద్ నగర్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్ కు ఈసారి కూడా మొండి చేయే ఎదురైంది. షాద్ నగర్ నుంచి ప్రతాప్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. టికెట్లు దక్కించుకున్న వారిలో…
- ఖానాపూర్ – రమేష్ రాథోడ్
- ఎల్లారెడ్డి – జాజల సురేందర్
- ధర్మపురి – లక్ష్మణ్ కుమార్
- సిరిసిల్ల – కెకె మహేందర్ రెడ్డి
- మేడ్చెల్ – లక్ష్మారెడ్డి
- ఖైరతాబాద్ – శ్రవణ్ దాసోజు
- జూబ్లిహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
- షాద్‌నగర్ – ప్రతాప్ రెడ్డి
- భూపాల్‌పల్లి – గండ్ర వెంకట రమణా రెడ్డి
- పాలేరు – కండల ఉపేందర్ రెడ్డి